రక్షణ మంత్రిత్వ శాఖ
నావికాదళ విన్యాసాలు మలబార్‌లో పాలుపంచుకున్న భారతీయ నావికాదళం
Posted On:
26 AUG 2021 9:44AM by PIB Hyderabad
భారతీయ నావికాదళం యుఎస్ నావీ (యుఎస్ఎన్), జపనీస్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డిఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నావీ (ఆర్ఎఎన్) తో కలిసి ఆగస్టు 26-29 వరకు జరుగనున్న సీఫేజ్ మలబార్ 2021 విన్యాసాలలో పాలు పంచుకుంటోంది.
సముద్ర విన్యాసాలలో భాగమైన మలబార్ సిరీస్ 1992లో ఐఎన్- యుఎస్ఎన్ ( భారత- అమెరికా నావికాదళాల) విన్యాసాలుగా ప్రారంభమయ్యాయి. మలబార్‌లో శాశ్వత సభ్యుడిగా 2015లో జెఎంఎస్‌డిఎఫ్ చేరింది. అనంతరం, 2020లో జరిగిన విన్యాసాలలో రాయల్ ఆస్ట్రేలియన్ నావీ పాల్గొంది. ఈ ఏడాది యుఎస్ ఎన్ పశ్చిమ పసిఫిక్ లో నిర్వహిస్తున్న మలబార్ విన్యాసాలు ఈ పరంపరలో 25 ఎడిషన్.
ఈస్టర్న్ ఫ్లీట్ కు నాయకత్వం వహిస్తున్న విఎస్ ఎం, ఫ్లాగ్ ఆఫీసర్, రేర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి సారథ్యంలో భారతీయ నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కద్మత్, సహా పి81 పాట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పాలు పంచుకుంటున్నాయి. యుఎస్ఎస్ బారీ, యుఎస్ఎన్ఎస్ రాప్పాహాన్నాక్, యుఎస్ఎన్ఎస్ బిగ్ హార్న్, పి8ఎ ఎయిర్ క్రాఫ్ట్ యుఎస్ నావికాదళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాగా, ఒక జలంతర్గామి, పి1 పాట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కు అదనంగా జెఎస్ కాగా, మురసమే, షిరనుయి జాపనీస్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. హెచ్ఎంఎఎస్ వార్రాముంగా రాయల్ ఆస్ట్రేలియన్ నావీకి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఆగస్టు 21-24 వరకు గ్వామ్‌లో జరిగిన ఆపరేషన్ టర్న్ ఎరౌండ్ లో పాలుపంచుకున్న భారతీయ నావికాదళ నౌకలు అక్కడి నుంచి బయిలుదేరాయి గమ్యాన్ని చేరుకున్నాయి. ఈ దశలో, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఎబిసింగ్, ఎవిఎస్ఎం, విఎస్ఎం తమ యుఎస్ నావికాదళానికి చెందిన సహ అధికారులతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మలబార్ -21లో యాంటీ సర్ఫేస్, యాంటీ -ఎయిర్, యాంటీ - సబ్‌మెరైన్ యుద్ధకవాతు, సేనా విన్యాసాలు, వ్యూహాత్మక విన్యాసాలు సహా అనేక సంక్లిష్టమైన విన్యాసాలకు సాక్షిగా నిలువనుంది. ఇందులో పాలుపంచుకున్న నావికాదళాలకు పరస్పర నైపుణ్యాలను, అనుభవాలను పంచుకుని లబ్ధి పొందేందుకు ఈ విన్యాసాలు అవకాశాన్ని కల్పిస్తాయి.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్యవంతమైన ఆరోగ్య ప్రోటోకాళ్ళను పాటిస్తూ ఈ విన్యాసాలను నిర్వహించడం అన్నది ఇందులో పాలు పంచుకుంటున్న నావికాదళాల స్వేచ్ఛాయుత, బహిరంగ, సంఘటిత ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఉమ్మడి దార్శనికతకు అద్దం పడతాయి.
***
(Release ID: 1749238)
Visitor Counter : 313