యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా ఉద్యమం రెండవ వార్షికోత్సవం సందర్భంగా 2021 ఆగస్టు 29 న ఫిట్ ఇండియా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించనున్న క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
26 AUG 2021 1:19PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
* ఢిల్లీలోని దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభోత్సవం జరుగుతుంది.
* వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొననున్న భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్.
* 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా ఉద్యమం
ఫిట్ ఇండియా ఉద్యమం రెండవ వార్షికోత్సవం మరియు ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా29 ఆగస్టు 2021 న యువజన వ్యవహారాలు క్రీడల శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఆవిష్కరణ ఢిల్లీలోని ప్రముఖ మేజర్‌లో జరుగుతుంది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి,శ్రీ నిసిత్ ప్రామాణిక్ కూడా కార్యక్రమంలోపాల్గొంటారు.
వర్చువల్ విధానంలో భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, అయాజ్ మెమన్, పాఠశాల విద్యార్థి కెప్టెన్ అనీ దివ్య, ఒక గృహిణి కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన తర్వాత ఫిట్ ఇండియా యాప్‌ను ఏవిధంగా ఉపయోగించాలన్న అంశాన్ని ప్రదర్శిస్తారు.
ఫిట్ ఇండియా యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక స్మార్ట్‌ఫోన్‌లలో కూడా పనిచేసేలా ఈ యాప్ ను ను అభివృద్ధి చేశారు.
ప్రారంభ వేడుకను ఫిట్ ఇండియా ఫేస్‌బుక్ పేజీలో లైవ్‌లో చూడవచ్చు. ఆగస్టు 29 నుంచి గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని 29 ఆగస్టు 2019 న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశాన్ని శారీరకంగా, ఆరోగ్య పరంగా దృఢంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఫిట్ ఇండియా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్ లాంటి కార్యక్రమాల్లో అనేక లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు.
'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల్లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ని ఫిట్ ఇండియా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం'ఆజాది కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
***
(Release ID: 1749237)
Visitor Counter : 253