ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ప్రగతి’37 వ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

Posted On: 25 AUG 2021 7:48PM by PIB Hyderabad

కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారితమైన మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్.. పిఆర్ఎజిఎటిఐ (‘ప్రగతి’) 37 వ సంచిక తాలూకు సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.

ఈ సమావేశం లో ఒక పథకం, ఎనిమిది ప్రాజెక్టు లు సహా తొమ్మిది కార్యాచరణ ప్రణాళిక సంబంధి అంశాల ను సమీక్ష కు స్వీకరించారు. 8 ప్రాజెక్టుల లోనూ రైల్ వే ల మంత్రిత్వ శాఖ కు చెందిన మూడు ప్రాజెక్టు లు, రోడ్డు రవాణా, హైవే ల మంత్రిత్వ శాఖ కు చెందిన మూడు ప్రాజెక్టు లు, విద్యుత్తు మంత్రిత్వ శాఖ కు చెందిన రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఎనిమిది ప్రాజెక్టు ల మొత్తం వ్యయం 1,26,000 కోట్ల రూపాయలు. ఈ ఎనిమిది ప్రాజెక్టు లు 14 రాష్ట్రాల కు చెందినవి. ఆ పద్నాలుగు రాష్ట్రాల లోనూ ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్ గఢ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్, ఉత్తరాఖండ్, మణిపుర్, దిల్లీ లు ఉన్నాయి.

 

ఈ ప్రాజెక్టుల ను సకాలం లో పూర్తి చేయడానికి గల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

సమావేశం సాగిన క్రమం లో, వన్ నేశన్-వన్ రేశన్ కార్డ్’ (ఒఎన్ఒఆర్ సి) పథకాన్ని ప్రధాన మంత్రి సమీక్షించారు. పౌరుల కు విస్తృత ప్రయోజనాల ను అందించడానికి పూచీ పడేందుకు గాను ఈ పథకం లో భాగం గా అభివృద్ధి పరచిన సాంకేతిక పరమైన ప్లాట్ ఫార్మ్ తాలూకూ వివిధ ఉపయోగాల ను గురించి అన్వేషించవలసిందిగా అధికారుల కు ఆయన సూచించారు.

ఆసుప్రతి పడక ల లభ్యత అంశం తో పాటు ఆక్సీజన్ ప్లాంటు ల నిర్మాణాన్ని కూడా పర్యవేక్షించవలసిందని రాష్ట్రాల అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు.

ఇది వరకు జరిగిన 36 ప్రగతి సమావేశాల లో మొత్తం 13.78 లక్షల కోట్ల రూపాయల వ్యయం తో కూడిన 292 ప్రాజెక్టుల ను సమీక్షించడం జరిగింది.

***

 


(Release ID: 1749185) Visitor Counter : 217