ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణల అజెండా!
-ఇ.ఎ.ఎస్.ఇ. 4.0- పేరిట 4వ విడతకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీకారం
-ఇ.ఎ.ఎస్.ఇ. 3.0- అవార్జు విజేతల ప్రకటన
Posted On:
25 AUG 2021 4:59PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణల అజెండా 4వ విడతను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఆవిష్కరించారు. ఖాతాదారులతో పెరిగిన అనుసంధానం, సేవలల్లో ప్రతిభ (ఇ.ఎ.ఎస్.ఇ. 4.0) పేరిట 2021-22వ సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణల అజెండాను ఆమె విడుదల చేశారు. టెక్నాలజీ ఆధారిత సామర్థ్యం, సరళీకరణం, సహకార బ్యాంకింగ్ వంటి అంశాలతో ఈ అజెండాను రూపొందించారు. ఇ.ఎ.ఎస్.ఇ. 3.0 పేరిట 3వ విడత ప్రభుత్వరంగ బ్యాంకుల సంస్కరణల అజెండా వార్షిక నివేదికను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి విడుదల చేశారు. ఇ.ఎ.ఎస్.ఇ.-3.0 విడతలో ఉత్తమశ్రేణి పనితీరును కనబరిచిన బ్యాంకులకు సత్కారం అందించేందుకు ఈ రోజు జరిగిన అవార్డులు ప్రదాన కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శులు పంకజ్ జైన్, అమిత్ అగర్వాల్, భారతీయ బ్యాంకుల సంఘం (ఐ.బి.ఎ.) చైర్మన్ రాజ్.కిరణ్ రాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఎస్.బి.ఐ., బి.ఒ.బి, యూనియన్ బ్యాంకులకు అగ్రస్థాయి గౌరవం
ఇ.ఎ.ఎస్.ఇ. సూచిక ప్రకారం, 3వ విడత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణల్లో (ఇ.ఎ.ఎస్.ఇ.-3.0లో) ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ.), బ్యాంక్ ఆఫ్ బరోడా (బి.ఒ.బి.), యూనియన్ బ్యాంక్ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
బేస్ లైన్ పనితీరులో ఉత్తమమైన తీరును చూపిన ఇండియన్ బ్యాంకుకు అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణల అజెండా 3వ విడతలో (ఇ.ఎ.ఎస్.ఇ.-3.0)లో వివిధ అంశాల వారీగా ఎస్.బి.ఐ., బి.ఒ.బి., యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు అగ్రశ్రేణి పురస్కారాలు గెలుచుకున్నాయి.
ఇ.ఎ.ఎస్.ఇ. 3.0 అవార్డుల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు చక్కని ఆదాయాన్ని సాధించడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పలు సంస్కరణలను అమలు చేశాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులు రూ. 31,817కోట్ల లాభం ఆర్జించాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇవే బ్యాంకులు ఎదుర్కొన్న రూ. 26,016కోట్ల నష్టంతో పోల్చుకుంటే 2021 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల పనితీరు బాగా మెరుగుపడినట్టుగా భావించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదేళ్లపాటు నష్టాలను ఎదుర్కొన్న తర్వాత లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం మార్చి నెల నాటికి బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ రూ. 6.16కోట్లుగా ఉంది. 2020 మార్చి నెలతో పోల్చుకుంటే ఇది రూ. 62,000కోట్లు తక్కువ.
డిజిటల్ పద్ధతిలో రుణసహాయం
ఇ.ఎ.ఎస్.ఇ. 3.0 పేరిట రుణాల పంపిణీ కోసం క్రెడిట్@క్లిక్ (Credit@click) అనే ఫ్లాగ్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంకులు చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు, రుణాల మంజూరులో అమలు చేసిన సరళతర ప్రక్రియ కారణఁగా దాదాపు 4.4 లక్షలమంది ఖాతాదారులు ప్రయోజనం పొందారు.
- ఖాతాదారులు డిజిటల్ పద్ధతుల ద్వారా 24 గంటలూ నిర్విరామంగా రుణాల దరఖాస్తులను నమోదు చేసుకునే వ్యవస్థను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేశాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్.ఎం.ఎస్., మిస్డ్ కాల్, కాల్ సెంటర్ వంటి డిజిటల్ పద్ధతులను అవి ప్రవేశపెట్టాయి. 2021వ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలసి ఉమ్మడిగా రూ. 40,819కోట్ల వ్యక్తిగత రుణాలు, గృహ, వాహన రుణాలు పంపిణీ చేశాయి. డిజిటల్ మార్గాల ద్వారా అందిన సమాచారం ఆధారంగానే ఈ రుణాల పంపిణీని బ్యాంకులు చేపట్టాయి.
- ప్రభుత్వ రంగం పరిధిలోని 7 అగ్రశ్రేణి బ్యాంకులు తమ ప్రస్తుత ఖాతాదారులకు మరింత చురుకుగా రుణాలు అందించేందుకు వీలుగా విశ్లేషకుల బృందాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) మౌలిక సదుపాయాలను కల్పించుకున్నాయి. బ్యాంకుల పరిధిలోనే అందుబాటులో ఉన్న ఖాతాదారుల లావేదేవీల సమాచారాన్ని వినియోగించుకుని రుణ సదుపాయాలను కల్పించాయి. 2021వ ఆర్థిక సంవత్సరంలో రూ. 49,777కోట్ల మేర తాజా రిటెయిల్ రుణాలను 7 అగ్రశ్రేణి బ్యాంకులు పంపిణీ చేశాయి.
- రిటైల్ సెగ్మెంట్ రుణాలను, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల) రుణాలను అందించే లక్ష్యంతో,.. బాహ్య భాగస్వామ్యాలను, మార్కెటింగ్ విక్రయ సిబ్బంది వ్యవస్థను ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా వినియోగించుకున్నాయి. ఈ పద్ధతుల ద్వారా 2021వ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 9.1లక్షల రుణాలను అందించాయి.
మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఖాతాదారులకు సేవ
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని దాదాపు 72 శాతం ఆర్థిక లావాదేవీలు ప్రస్తుతం డిజటల్ పద్ధతుల్లోనే సాగుతున్నాయి. కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా 14 ప్రాంతీయ భాషల్లో ఖాతాదారులకు సేవలను అందిస్తున్నాయి. ఖాతారుల సౌకర్యార్థం తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాళీ, ఒడియా, కాశ్మీరీ, కొంకణి, హిందీ, పంజాబీ, అస్సామీ భాషల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.
- ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల కింద కవరేజీని మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్రలు అందించే లావాదేవీల్లో 13శాతం వృద్ధి నమోదైంది. సూక్ష్మ వ్యక్తిగత ప్రమాద బీమాకు సంబంధించి 50శాతం వృద్ధి జరిగింది. 2020వ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంతో పోలిస్తే, 2021వ సంవత్సరం 4వ త్రైమాసికంలో ఈ వృద్ధి చోటుచేసుకుంది.
ఇ.ఎ.ఎస్.ఇ.-3 పేరిట సంస్కరణల అజెండాను ప్రారంభించిన నాటినుంచి గడిచిన నాలుగు త్రైమాసికాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చక్కని వృద్ధిని నమోదు చేయగలిగాయి. 2020వ సంవత్సరం మార్చినుంచి 2021 మార్చి వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం పనితీరు స్కోరు 35శాతం పెరిగింది. వంద పాయింట్లకు గాను, సగటు ఇ.ఎ.ఎస్.ఇ. సూచిక స్కోరు 44.2నుంచి 59.7 స్థాయికి పెరిగింది. సంస్కరణల అజెండాలోని ఆరు అంశాలకు సంబంధించి గణనీయమైన ప్రగతి చోటుచేసుకుంది. ‘స్మార్ట్ రుణ సాయం’, ‘వివేచనతో కూడిన బ్యాంకింగ్.ను సంస్ఘాగతం చేయడం’ వంటి అంశాల్లో అత్యున్నత స్థాయిలో మెరుగుదల కనిపించింది.
ఇక సంస్కరణల అజెండాకు సంబంధించిన తదుపరి విడత కార్యక్రమం (ఇ.ఎ.ఎస్.ఇ.4.0)లో ఖాతాదారుల ప్రయోజనాలతో ముడివడి ఉన్నిడిజిటల్ మార్పులను చేపట్టనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరులో పూర్తి మార్పులు చేయనున్నారు.
ఇ.ఎ.ఎస్.ఇ. 4.0, కింద ప్రభుత్వరంగ బ్యాంకులు అందించే సేవలు:
కోవిడ్-19 సమయంలో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు: కేంద్ర ఆర్థిక మంత్రి
దేశవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పటికీ, ఖాతాదారులకు సేవలను, రుణాల బట్వాడాను నిరాటంకంగా కొనసాగిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశంసించారు. దేశంలోని అతి మారుమూల ప్రాంతాల వారికి కూడా బ్యాంకింగ్ సేవలను అందించడంలో బ్యాంకులు అగ్రస్థానంలో ఉన్నాయి.
కోవిడ్19 వ్యాప్తి సమయంలో కూడా వివిధ రకాల పద్ధతుల ద్వారా 80,000పైగా బ్యాంకుల శాఖలు పనిచేశాయి. దీనికి తోడుగా, ఆధార్ అనుసంధానంతో చెల్లింపుల వ్యవస్థ, సూక్ష్మ ఎ.టి.ఎం.ల పనితీరు కూడా రెండు రెట్లు పెరిగింది. 75,000మంది బ్యాంకు మిత్రల సహాయంతో ఇంటి ముంగిటికే అందించే బ్యాంకింగ్ సేవలు కూడా విస్తృతమయ్యాయి.
ఇ.ఎ.ఎస్.ఇ. 4.0 నివేదిక వివరాలను ఇక్కడ చూడవచ్చు.
.
***
(Release ID: 1749088)
Visitor Counter : 300