ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ

Posted On: 24 AUG 2021 8:44PM by PIB Hyderabad

రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

అఫ్ గానిస్తాన్ లో స్థితి ని గురించి, ఆ ప్రాంతం మీద, ప్రపంచం మీద ప్రసరించే ప్రభావాల ను గురించి  నేత లు ఇరువురు చర్చించారు.  వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు రెండు కలిసి పనిచేయడం  ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు.  సీనియర్ అధికారుల ను పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండవలసిందిగా వారు ఆదేశించారు.

కోవిడ్ మహమ్మారి సవాళ్ల ను రువ్వుతూ ఉన్నప్పటికీ ఉభయ దేశాల మధ్య గల ‘ప్రత్యేకమైన, విశేష అధికారాలు కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యం’ లో ప్రగతి చోటు చేసుకొంటూ ఉండడం పట్ల నేతలు ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  కోవిడ్ మహమ్మారి కి వ్యతిరేకం గా సాగుతున్న పోరాటం లో ప్రస్తుత ద్వైపాక్షిక సహకారాన్ని, ప్రత్యేకించి ‘స్పుత్ నిక్ వి’ టీకా మందు ఉత్పత్తి లో, సరఫరా లో అమలవుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని వారు ప్రశంసించారు.

బ్రిక్స్ శిఖర సమ్మేళనం, ఎస్ సిఒ దేశాధిపతుల మండలి సమావేశం, ఈస్టర్న్ ఇకోనామిక్ ఫోరమ్ లో భారతదేశం పాలుపంచుకోవడం సహా త్వరలో జరుగనున్న బహు పాక్షిక కార్యక్రమాల ను గురించి  కూడా నేత లు మాట్లాడుకొన్నారు.

తరువాతి ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారతదేశానికి ఎప్పుడు విచ్చేస్తారా అని తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ద్వైపాక్షిక అంశాల పట్ల, ప్రపంచ అంశాల పట్ల మరీ ముఖ్యం గా అఫ్ గానిస్తాన్ లోని స్థితి పట్ల తరచు గా సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలనే అంశం లో నేత లు ఇరువురూ వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.
 


 

***


(Release ID: 1748858) Visitor Counter : 180