రక్షణ మంత్రిత్వ శాఖ
బహుళ పక్ష సముద్ర విన్యాసాలు మలబార్‌లో పాలుపంచుకునేందుకు గ్వాంను చేరుకున్న భారతీయ నావికాదళ నౌకలు శివాలిక్, కద్మత్
Posted On:
22 AUG 2021 12:20PM by PIB Hyderabad
ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ మహా సముద్ర దేశాలలో కొనసాగుతున్న మోహరింపులో భాగంగా భారతీయ నావికాదళ నౌకలు శివాలిక్, కద్మత్ ఆగస్టు 21న యుఎస్ఎకు చెందిన ద్వీప ప్రాంతం గ్వామ్ ను చేరుకున్నాయి. ఈ రెండు నౌకలు వార్షిక విన్యాసమైన మలబార్ -21లో (MALABAR)లో పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యుఎస్ఎకు చెందిన నావికాదళాల మధ్య జరుగనున్నాయి. నావికాదళ విన్యాసాలైన మలబార్ సిరీస్ 1992లో యుఎస్- భారత్ ల ద్వైపాక్షిక విన్యాసంగా ప్రారంభమై, నేడు పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాలకు చెందిన నాలుగు ప్రముఖ నావికాదళాలను కలుపుకునే స్థితికి ఎదిగాయి. ఈ విన్యాసాలలో భాగంగా, తూర్పు నావికాదళ కమాండ్‌కు చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్- ఛీఫ్, వైస్ అడ్మిరల్ ఎబి సింగ్, కమాండర్ సిటిఎఫ్ -74 అయిన్ రేర్ అడ్మిరల్ లియోనార్డ్ సి. బుచ్ డొల్లాగాతో సముద్ర తీర ప్రాంతాలలో సమన్వయంతో కూడిన కార్యకలాపాలను నిర్వహించడం, అందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపై దృష్టి పెట్టి కార్యాచరణ చర్చలను జరుపనున్నారు. ఆగస్టు 26వ తేదీన ప్రారంభం కానున్న సీ ఫేజ్ నిర్వహణ సమయంలో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్, రేర్ అడ్మిరల్ తరుణ సోబ్తి ఐఎన్ఎస్ శివాలిక్‌లో కి ప్రవేశించనున్నారు.
మలబార్ -21 విన్యాసాలను యుఎస్ఎన్, జెఎంఎస్‌డిఎఫ్, ఆర్ ఎఎన్ తో కలిసి ఆగస్టు 26-29 వరకు సముద్రంలో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆలోచన కలిగిన నావికాదళాలు తమ అంతర్ కార్యకలాపాలను పెంచుకునేందుకు, ఉత్తమ ఆచరణ నుంచి లబ్ధి పొందేందుకు, సముద్ర భద్రతా కార్యకలాపాల పద్ధతులపై ఒక సామాన్య, ఉమ్మడి అవగాహన అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. ఈసారి మలబార్ -21 విన్యాసాలలో పాలుపచుకుంటున్న నావికాదళాల డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, కార్వేట్‌లు, సబ్ మెరైన్ లు, హెలికాప్టర్లు, లాంగ్ రేంజ్ మారిటైం పాట్రోల్ విమానాల మధ్య ఉత్తేజకరమైన విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. లైవ్ వెపన్ ఫైరింగ్ డ్రిల్లులు, యాంటీ- సర్ఫేస్, యాంటీ-ఎయిర్, యాంటీ - సబ్‌మెరైన్ యుద్ధ కవాతులు, సంయుక్త విన్యాసాలు, వ్యూహాత్మక విన్యాసాలు సహా సంక్లిష్టమైన ఉపరితల, భూమిలోపల (సబ్ సర్ఫేస్), వాయు కార్యకలాపాలు ఈ విన్యాసాల సందర్భంగా నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనల నడుమ ఈ విన్యాసాలను నిర్వహించడం అన్నది సురక్షితమైన సముద్రాలకు పాలుపంచుకుంటున్న నావికాదళాలు ఎంత కట్టుబడి ఉన్నాయో పట్టి చూపుతుంది.
ఇందులో పాల్గొంటున్న భారతీయ నౌకలు శివాలిక్, కద్మత్ అన్నవి ఇటీవలే దేశీయంగా రూపొందించి, నిర్మంచిన, బహుళ పాత్రలు నిర్వహించగల గైడెడ్ మిస్సైళ్ళను ధ్వంసం చేయగల యుద్ధ నౌక, యాంటీ-సబ్‌మెరైన్ కార్వెట్ కూడా. ఇవి భారతీయ నావికాదళానికి చెందిన ఈస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలోని ఈస్టర్న్ ఫ్లీట్ లో భాగం. ఈస్టర్న్ ఫ్లీట్ విశాఖపట్నం నుంచి పని చేస్తుంది. ఐఎన్ఎస్ శివాలిక్‌ను కెప్టెన్ కపిల్ మెహతా కమాండ్ చేస్తుండగా, ఐఎన్ఎస్ కద్మత్ ను కమాండర్ ఆర్ కె మహారాణా కమాండ్ చేస్తున్నారు. ఈ రెండు నౌకలు కూడా బహుముఖ ఆయుధాలు, సెన్సార్లను సమకూర్చుకుని, బహుళ పాత్ర పోషించగల హెలికాప్టర్లను మోసుకుపోగలవు. ఇవి భారతదేశ యుద్ధనౌకల నిర్మాణ సామర్ధ్యాల అభివృద్ధికి సంకేతంగా నిలుస్తాయి.
***
(Release ID: 1748072)
Visitor Counter : 301