ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 58 కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ

గత 24 గంటల్లో 52 లక్షలకు పైగా టీకాలు
కోలుకున్నవారి శాతం (97.57%) 2020 మార్చి తరువాత అత్యధికం
గత 24 గంటల్లో 30,948 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,53,398; ఇది152 రోజుల అత్యల్పం
చికిత్సలో ఉన్నవి మొత్తం కేసుల్లో 1.09%. మార్చి 2020 తరువాత అత్యల్పం

రోజువారీ పాజిటివిటీ 1.95%, 27 రోజులుగా 3% లోపు

Posted On: 22 AUG 2021 10:34AM by PIB Hyderabad

గత 24 గంటలలో 52,23,612 డోసులు ఇవ్వగా భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 58 కోట్ల మైలురాయి దాటింది. 64,39,411 శిబిరాల ద్వారా మొత్తం  58,14,89,377 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. అ వివరాలు ఇలా ఉన్నా యి:

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,53,366

రెండో డోస్

82,10,206

కోవిడ్ యోధులు

 మొదటి డోస్

1,83,03,885

రెండో డోస్

1,25,60,909

18-44 వయోవర్గం

మొదటి డోస్

21,63,66,206

రెండో డోస్

1,93,27,127

45-59 వయోవర్గం

మొదటి డోస్

12,24,63,403

రెండో డోస్

4,87,01,565

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

8,32,68,790

రెండో డోస్

4,19,33,920

మొత్తం

58,14,89,377

 

టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో 38,487 మంది బాధితులు కోలుకోగా ఇప్పటిదాకా  3,16,36,469 మందికోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.57 % కు చేరుకోవటం విశేషం. 2020 మార్చి నుంచి  కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం

 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  30,948 కొత్త కేసులు నమోదయ్యాయి. 56 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

పెద్ద సంఖ్యలో కోలుకున్నవారు నమోదవటం, కొత్త కేసులు తక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ 3,53,398 కి చేరింది. ఇది   152  రోజుల అత్యల్పం. మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవి  ప్రస్తుతం  1.09 % మాత్రమే. ఇది మార్చి 2020 తరువాత  అత్యల్పం.

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 15,85,681 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 50.62 కోట్లకు పైగా (50,62,56,239) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.00% కాగా ఇది 58    రోజులుగా 3% లోపు ఉంటోంది.  రోజువారీ పాజిటివిటీ  1.95 % కు చేరగా వరుసగా 27   రోజులుగా 3% లోపు,  76 రోజులుగా 5% లోపే ఉంటోంది.

.

****



(Release ID: 1748071) Visitor Counter : 223