రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ముగిసిన హైదరాబాద్ 35వ సెయిలింగ్ వీక్

Posted On: 20 AUG 2021 10:23AM by PIB Hyderabad

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సరస్సులో   యాచింగ్ అసోసియేషన్ ఆఫ్  ఇండియా  35వ సెయిలింగ్ వీక్ ను  2021 ఆగస్టు 13 నుంచి 19వరకు నిర్వహించింది. జాతీయ స్థాయి ర్యాంకింగ్ పోటీలలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 120 మంది నావికులు లేజర్ స్టాండర్డ్, 4.7 మరియు రేడియల్ క్లాస్‌ విభాగాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్నఇండియన్ నేవీ వాటర్‌మ్యాన్‌షిప్ ట్రైనింగ్ సెంటర్   నేవీ సెయిలింగ్ టీమ్ నుంచి తొమ్మిది మంది సభ్యులువిశాఖపట్నం ఇండియన్ నేవీ వాటర్‌మ్యాన్‌షిప్ ట్రైనింగ్ సెంటర్  నుంచి    ఐదుగురు సభ్యులు మరియు ఐఎన్ఎస్ మాండోవి  నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ నుంచి  ఆరుగురు సభ్యులు  లేజర్ 4.7 క్లాస్ బోట్‌లో  పోటీపడ్డారు. ఇది ఒలింపిక్ క్లాస్ తరగతికి చెందిన  లేజర్ క్లాస్ ఆఫ్ బోట్స్‌ పోటీలను  పురుషులు మహిళలుకు  1986 నుంచి  క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

 

  యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్  ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  పోటీలలో పాల్గొన్న వారు ప్రదర్శించిన  ప్రతిభను ప్రశంసించిన ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. (Release ID: 1747672) Visitor Counter : 159