బొగ్గు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను పుర‌స్క‌రించుకొనిరెండు రోజుల హ‌స్త‌క‌ళ‌ల ప్ర‌ద‌ర్శ‌న - అమ్మ‌కాలను ప్రారంభించిన బొగ్గు మంత్రిత్వ శాఖ‌కు చెందిన సిఎంపిడిఐఎల్‌

Posted On: 19 AUG 2021 1:59PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌లో భాగంగా బొగ్గ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సిఎంపిడిఐఎల్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల హ‌స్త‌క‌ళ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌- అమ్మ‌కాలను  ర‌బీంద్ర భ‌వ‌న్‌లో బుధ‌వారం ప్రారంభ‌మైంది. 
ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో రాంచీ జిల్లా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన గ్రామీణ మ‌హిళ‌లు ఆక‌ర్ష‌ణీయంగా త‌యారు చేసిన జ‌న‌ప‌నార ఉత్ప‌త్తులు, ఫ్రేమ్‌లు, చెక్క‌తో, వెదురుతో చేసిన క‌ళాకృతులు, హ్యాండ్ బ్యాగ్‌లు, టెర్రాకోటా ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌కానికి ఉంచారు.
బంక‌మ‌న్ను, జ‌న‌పనార‌, వెదురు త‌దిత‌ర ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మ‌మైన స‌హ‌జ వ‌న‌రులతో చేసిన ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించి ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడ‌కాన్ని త‌గ్గించేలా చేయ‌డం ఈ ప్ర‌ద‌ర్శ‌న ల‌క్ష్యం. ఇది ప‌ర్యావ‌ర‌ణ క్షీణ‌త‌ను నివారించ‌డ‌మే కాక స్థానిక చేతివృత్తి ప‌నివార‌ల‌కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తుంది.  

***


 (Release ID: 1747557) Visitor Counter : 235