కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2018 &2019 బ్యాచీకి చెందిన ఐటిఎస్ ప్రొబేషనర్లతో ముచ్చటించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర
Posted On:
19 AUG 2021 12:35PM by PIB Hyderabad
భారతీయ టెలికమ్యూనికేషన్ సర్వీసు (ఇండియన్ టెలికమ్యూనికేషన్స్‌సర్వీస్) 2018, 2019 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ అధికారులతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర గురువారం న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ముచ్చటించారు.
ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రసీ లండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడిఇఎం)లో భారతీయ టెలికమ్యూనికేషన్ సేవల (ఐటిఎస్) అధికారులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈ చర్చ జరిగింది.
యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన కేంద్ర సివిల్ సర్వీసులలో (గెజిటెడ్) పోస్టులలో ఐటిఎస్ ఎ గ్రూపుకు చెందింది. టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికి సాంకేతిక, నిర్వాహక విధులను ఈ సర్వీసు నిర్వహిస్తుంది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (డిఒటి) ఐటిఎస్ అధికారులకు సంబంధించిన కేడర్ నియంత్రణ, కేడర్ నిర్మాణం, భర్తీ, డిప్యూటేషన్, వేతనం, అలవెన్సులు, క్రమశిక్ష అంశాలకు సంబంధించిన విధాన నిర్ణయాల బాధ్యతను నిర్వరిస్తుంది.
టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన విధాన సూత్రీకరణ, విధాన అమలుకు సంబంధించిన అంశాలపై ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీసు అధికారులు పని చేస్తారు. ఐటిఎస్ అధికారులు దేశంలోని అన్ని లైసెన్సు సేవా ప్రాంతాలు, పెద్ద టెలికాం జిల్లాలలోనూ టెలిగ్రాఫ్ అథారిటీ పాత్రను నిర్వర్తిస్తారు. సర్వీసు ప్రొవైడర్లు లైసెన్సు షరతులకు కట్టుబడి ఉండేలా చూడడమే కాక, నెట్‌వర్క్ భద్రతా సమస్యల బాధ్యతలను తీసుకోవడమే కాక, చట్టవ్యతిరేక / రహస్య టెలికాం కార్యకలాపాల పై కఠిన చర్యలు తీసుకుంటారు.
***
(Release ID: 1747392)
Visitor Counter : 182