ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ కింద 2కోట్ల చికిత్సలు పూర్తి!


ఆరోగ్యధార-2 కార్యక్రమంలో కేంద్రమంత్రి
మాండవీయ అభినందనలు

“నిరుపేదల, నిస్సహాయుల బాధలను అర్థం చేసుకునేందుకు
ప్రధానమంత్రికి ఆయన నేపథ్యమే దోహదపడింది.”

నిరుపేదలకు, సంపన్నులకు ఒకే చోట, ఒకేరకం చికిత్స
అదే ఆయుష్మాన్ భారత్ విజయం: మాండవీయ

Posted On: 18 AUG 2021 4:58PM by PIB Hyderabad

 ఆయుష్మాన్ భారత్ విజయవంతం కావడంపై నిర్వహించిన 2వ దశ ఆరోగ్యధార (ఆరోగ్యధార-2) కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ నెల 18న అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై.) పథకం కింద ఆసుపత్రుల్లో 2కోట్లకుపైగా చికిత్సలు ముగిసిన సందర్భంగా ఆరోగ్యధార 2వ దశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

  ఆసుపత్రుల్లో అడ్మిషన్ల సంఖ్య ఈ నెల 17 నాటికి రెండుకోట్లు దాటడంతో ఇప్పటివరకూ దాదాపు రూ. 25,000కోట్ల వ్యయంతో కూడిన చికిత్సలు పూర్తి చేసినట్టయింది. పథకం మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ  23,000 ప్రభుత్వ, ప్రైవేట్ ప్యానెల్ ఆసుపత్రుల ద్వారా 33రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రోగులు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు అందుకున్నారు. 2018 సెప్టెంబరు 23వ తేదీన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

https://ci4.googleusercontent.com/proxy/iGtwGyrJzzXdqrGOrhrSQnGHC2JGuZoNoiLLbeH17TYE2HSmDRRCC0GwXW1lU7ii_RL8SdbV2454M8oQ5NlKCucD9qXzf4XbjrI5sryTFeAazwHq9SjWTX0Pug=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00151LO.jpghttps://ci4.googleusercontent.com/proxy/lMZ-QT2NkM7giUEq281aiJAqm2ZoXE8daxrm5LvYWUAaGZZgWTDjjcN3krix4oq3mBmfTkImYbNz0hCdSPHNI2KaqxzTXJzHnRQgQOgr32f_eMR7wBm8YIOI7g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002H1GD.jpg

  రెండవ దశ ఆరోగ్యధార కార్యక్రమంలో కేంద్రమంత్రి మన్.సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పథకం విజయవంతం కావడం ఆనందదాయకమన్నారు. పథం విజయానికి కారణమైన ప్రతి ఉద్యోగిని ఆయన అభిందించారు. “నిరుపేదలకు, వైద్య చికిత్సకు నోచుకోని నిమ్నవర్గాల వారికి అందుబాటు యోగ్యమైన, నాణ్యమైన చికిత్స అందేలా చూసేందుకు చేపట్టిన బృహత్తర పథకమే ఆయుష్మాన్ భారత్ పి.ఎం.-జె.ఎ.వై... నగదు రహిత, కాగిత రహిత పద్ధతుల్లో ఆరోగ్య రక్షణ సేవలను అందించడం ద్వారా ఈ పథకం అర్హులందరికీ వైద్యసేవలపై సాధికారత కల్పించింది. సంవత్సరానికి దాదాపు 5లక్షల మందికి ఆరోగ్య సేవల ప్రయోజనాలను అందిస్తోంది.  దీనితో వైద్య చికిత్సకు నోచుకోని నిరుపేద వర్గాలవారు వైద్యం ఖర్చుకోసం రుణదాతలవద్దకు వెళ్లకుండానే అందుబాటు యోగ్యమైన చికిత్సను పొందే అవకాశం కలిగింది.” అని కేంద్రమంత్రి అన్నారు.

  భారతదేశంలో పూర్తి స్థాయిలో సార్వత్రిక ఆరోగ్యపథకాలను వర్తింపజేయాలన్న రాజకీయ సంకల్పానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. “నిరుపేదల, నిస్సహాయుల బాధలను అర్థం చేసుకోవడానికి ప్రధానమంత్రికి ఆయన సొంత నేపథ్యమే దోహదపడింది.” అని అన్నారు. ఈ పథకం కింద మరింత మంది లబ్ధిదారులు నమోదై, ఆరోగ్య సేవలు పొందేలా సామాన్య ప్రజలందరికీ ఈ పథకం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. నిరుపేదలు, సంపన్నులు ఒకే చోట ఒకే రకమైన చికిత్స పొందేందుకు ఈ పథకం వీలు కల్పిందన్నారు.

  ఆయుష్మాన్ భారత్, పి.ఎం. జె.ఎ.వై. పథకం పరిధిలోకి దేశంలోని మరిన్ని నిరుపేద కుటుంబాలకు చేర్చేందుకు, పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఆరోగ్యధార-2 కార్యక్రమాన్ని కేంద్రమంత్రి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

https://ci3.googleusercontent.com/proxy/FJdd8--GyZHrzzEgn_ZbVaaPpVuIhfiBCpedw2ayt_ORJYcpdhaO_dfAXHuLNnW1VoTpgEt5k8ZcEtuNdOXZL2_uPBWP-zZ_zFv5Lt4GHMgtlLQblac0Nogp6g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036FHR.jpg

ఈ సందర్భంగా ఈ కింది కీలక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

అధికార పత్ర: పి.ఎం.-జె.ఎ.వై. పథకం కింద ఆసుపత్రిలో చేరినపుడు లబ్ధిదారులకు జారీ చేసేందుకు ఈ పత్రాన్ని రూపొందించారు. ఈ పథకం కింద 5లక్షల రూపాయల వరకూ ఖరీదైన చికిత్సను ఉచితంగా, నగదు రహితంగా పొందేందుకు తమకుగల హక్కును గురించి లబ్ధిదారులకు తెలియజెప్పడం దీని లక్ష్యం.

అభినందన పత్ర: పి.ఎం.-జె.ఎ.వై. పథకం కింద ప్రయోజనాలతో చికిత్స పొంది ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యే లబ్ధిదారులకు అందించే ‘కృతజ్ఞతా పత్రం’ ఇది.  పథకం కింద తనకు అందిన సేవలపై లబ్ధిదారులు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కూడా ఈ అభినందన పత్రానికి జతచేస్తారు.

ఆయుష్మాన్ మిత్ర:  ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఇది మరో కీలక కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ పథకం దార్శనికతకు మద్దతుగా పౌరులందరూ సేవలందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అర్హులందరికీ ఆయుష్మాన్ కార్డులు తయారు చేయించి, వారినీ పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో ఈ దీన్ని ప్రారంభించారు.  https://pmjay.gov.in/ayushman-mitrato   అనే పోర్టల్.ను సంప్రదించడం ద్వారా అర్హులకోసం ఆయుష్మాన్ మిత్ర గుర్తింపు (ఐ.డి.) కార్డును పొందవచ్చు.  ఆయుష్మాన్ కార్డులు పొందేటపుడు, ఈ పథకం కింద చికిత్సా సేవలను పొందేటపుడు ఆయుష్మాన్ మిత్ర ఐ.డి. కార్డును ప్యానెల్ ఆసుపత్రులకు చూపించవచ్చు.

 ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో కూడా కేంద్రమంత్రి మాండవీయ ఈ సందర్భంగా ముచ్చటించారు.

  జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) డాక్టర్ ఆర్.ఎస్. శర్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు  సేవలందించడంలో ఎన్.హెచ్.ఎ. ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ పథకం కింద  లబ్ధిదారులు కాలబద్ధమైన పద్ధతిలో రూ. 5లక్షల మేర ఆర్థిక సహాయాన్ని దేశంలో ఎక్కడైనా పొందేందుకు వీలుందన్నారు. సరళమైన, వేగవంతమైన, పారదర్శకమైన, నగదరు రహిత, కాగిత రహిత ప్రక్రియ ద్వారా క్లెయిములను పరిష్కరించడానికి ఐ.టి. వేదికలు దోహదపడుతున్నాయన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 50కోట్ల మందిని నమోదు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని త్వరలో సాధించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, పథకం అమలుకోసం, తక్కువ వ్యవధిలో లక్ష్యాలు సాధించడం కోసం ఎన్.హెచ్.ఎ. కుటుంబం అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.  గత మూడేళ్లలోనే ఆసుపత్రి సేవల వ్యవస్థను ఈ పథకం విప్లమాత్మకంగా మార్చివేసిందన్నారు.

  ఎన్.హెచ్.ఎ. అదనపు సి.ఇ.ఒ. డాక్టర్ ప్రవీణ్ గెడం, ఎన్.హెచ్.ఎ. డిప్యూటీ సి.ఇ.ఒ. డాక్టర్ విపుల్ అగ్గర్వాల్, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కింది సామాజిక మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని వెబ్ క్యాస్ట్ చేశారు.:

ఫేస్.బుక్ - https://www.facebook.com/AyushmanBharatGoI/live_videos/

ట్విట్టర్ - https://twitter.com/i/broadcasts/1MYxNmomYwQJw

యూట్యూబ్ - https://youtu.be/fWQj-qZ6YZA

 

****



(Release ID: 1747240) Visitor Counter : 219