రక్షణ మంత్రిత్వ శాఖ
కార్ నికోబార్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో స్వర్నిమ్ విజయ్ వర్ష్ విజయ జ్వాల
Posted On:
18 AUG 2021 11:18AM by PIB Hyderabad
కీలకాంశాలుః
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక వేడుక
1971 యుద్ధంలో భారత్ విజయాన్ని సంస్మరించుకునే కార్యక్రమంలో మాజీ సైనికాధికారులకు సన్మానం
విజయ జ్వాల (విక్టరీ ఫ్లేమ్)తో 200మంది సాయుధ దళాల సిబ్బంది విక్టరీ రన్
హరిత భారతం ప్రచారంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహణ
స్వర్నిమ్ విజయ్ వర్ష్ విజయ జ్వాల సందర్శన చిహ్నంగా కార్ నికొబార్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించారు. 1971 యుద్ధంలో భారత్ విజయ స్మారకంగా 2021ని స్వర్నిమ్ విజయ్ వర్ష్ గా జరుపుకుంటున్నారు. ఉత్సవం విజయ జ్వాల రాకతో ప్రారంభమై, సెర్మోనియల్ సెల్యూట్ తో దానిని గౌరవించారు.
కార్ నికోబార్ డిప్యూటీ కమిషనర్ యష్ చౌదరి, ఇతర సీనియర్ పౌర & సైనిక అధికారులు, మాజీ సైనికాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు 1971 యుద్ధం గురించి, ముఖ్యంగా, దాని చారిత్రిక విజయంలో సాయుధ దళాల పాత్ర గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ సందర్భంగా హాజరైన వెటరన్ లు అందరినీ కార్ నికొబార్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ - స్టేషన్ కమాండర్ సన్మానించారు.
అమరవీరులకు నివాళులు అర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించడంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం విజయ జ్వాలతో సాయుధ దళాలకు చెందిన 200మంది సైనికులు విక్టరీ రన్ ను నిర్వహించారు.
హరిత భారత ప్రచారంలో భాగంగా, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
***
(Release ID: 1747132)
Visitor Counter : 194