ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 56 కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ


97.52% గా నమోదైన కోలుకున్నవారి శాతం; 2020 మార్చి తరువాత అత్యధికం

గత 24 గంటల్లో 35,178 కొత్త కోవిడ్ కేసులు

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,67,415; 148 రోజుల అత్యల్పం
చికిత్సలో ఉన్నవి మొత్తం కేసుల్లో 1.14%. మార్చి 2020 తరువాత అత్యల్పం
రోజువారీ పాజిటివిటీ 1.96%, 23 రోజులుగా 3% లోపు

Posted On: 18 AUG 2021 9:50AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 56  కోట్ల మైలురాయి దాటింది. 62,67,149 శిబిరాల ద్వారా మొత్తం  56,06,52,030 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది గత 24 గంటలలో 55,05,075 టీకా డోసుల పంపిణీ జరిగింది.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,51,471

రెండో డోస్

81,39,176

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,82,91,828

రెండో డోస్

1,23,10,279

18-44 వయోవర్గం

మొదటి డోస్

20,53,38,194

రెండో డోస్

1,66,89,475

45-59 వయోవర్గం

మొదటి డోస్

11,96,50,340

రెండో డోస్

4,68,78,435

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

8,20,88,223

రెండో డోస్

4,09,14,609

మొత్తం

56,06,52,030

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.52% కు చేరుకోవటం విశేషం. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా  3,14,85,923 మందికోలుకున్నారు.  గత 24 గంటలలో 37,169 మంది బాధితులు కోలుకున్నారు.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  35,178 కొత్త కేసులు నమోదయ్యాయి.  52  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 

దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 3,67,415 మంది. ఇది 148 రోజుల అత్యల్పం.  చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.14% మాత్రమే

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 17,97,559 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 49.84  కోట్లకు పైగా (49,84,27,083) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  1.95% కాగా ఇది 54 రోజులుగా 3% లోపు ఉంటోంది.  రోజువారీ పాజిటివిటీ  1.95% కు చేరగా వరుసగా 23  రోజులుగా 3% లోపు,  72రోజులుగా 5% లోపే ఉంటోంది.

***

 



(Release ID: 1747130) Visitor Counter : 135