విద్యుత్తు మంత్రిత్వ శాఖ

గ్రీన్ హైడ్రోజన్ పై భారత్ తో కలసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన యూకే

సీఓపీ 26 అధ్యక్షుడు శ్రీ అలోక్ శర్మను కలిసిన కేంద్ర విద్యుత్ మరియు , పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్

గ్రీన్ హైడ్రోజన్, లిథియం-అయాన్ కోసం నిర్వహించనున్న వేలంలో పాల్గోవాలని యూకే ను కోరిన భారత్

గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచ బ్యాంకును నెలకొల్పడానికి గల అవకాశాలను పరిశీలించనున్న ఇరుపక్షాలు

సముద్రతీర గాలిపై యూకే తో కలసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన భారత్

Posted On: 17 AUG 2021 4:04PM by PIB Hyderabad

సమర్ధంగా పనిచేయని 16369 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను 2021 మార్చి నాటికి భారతదేశం మూసివేసింది. ఈ అంశాన్ని  సీఓపీ 26 అధ్యక్షుడు  శ్రీ అలోక్ శర్మకు కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్ తెలిపారు. ఈరోజు అలోక్ శర్మతో మంత్రి సమావేశం అయ్యారు. బొగ్గు ఆధారంగా పని చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను దశలవారీగా మూసివేసే అంశాన్ని శ్రీ శర్మ సమావేశంలో ప్రస్తావించారు. సమావేశంలో ఇంధన కార్యదర్శి, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారతదేశంలో యూకే హై కమిషనర్ కూడా పాల్గొన్నారు. 

 

గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారతదేశంతో కలసి పనిచేయడానికి యూకే సిద్ధంగా ఉందని శ్రీ శర్మ తెలిపారు.  గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచ బ్యాంకును నెలకొల్పడానికి గల అవకాశాలను పరిశీలించాలని రెండు దేశాలు అంగీకరించాయి. దీని ద్వారా పారిస్ ఒప్పందంలో అంగీకరించిన విధంగా పర్యావరణ అంశానికి 100 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశం కలుగుతుంది. సీఓపీ 26 సమావేశాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని భారత్ కు యూకే కోరింది.

 

సముద్రతీర గాలిపై యూకే తో కలసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ శర్మకు మంత్రి తెలిపారు. నిల్వ వ్యయాన్ని తగ్గించడానికి అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి  చెప్పారు.  పారిస్ ఒప్పందం ప్రకారం  ఏర్పాటు  ఎన్ డీసి  ప్రకారం జీ 20 దేశాలలో  భారతదేశం మాత్రమే చర్యలను అమలు  చేస్తున్నదని ఆయన ప్రతినిధి బృందానికి తెలియజేశారు.

2030 నాటికి  450 మెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న భారత్ లక్ష్య సాధనకు నిల్వ సామర్థ్యాన్ని పెంచే అంశంపై సమావేశంలో చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్లిథియం-అయాన్ కోసం ఆహ్వానించనున్న వేలంలో పాల్గోవాలని యూకే ను  భారత్ కోరింది.  

 

***(Release ID: 1746788) Visitor Counter : 51