హోం మంత్రిత్వ శాఖ

ఆగస్టు 14వ తేదీని 'విభజన గాయాల స్మృతి దినం'గా పాటించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


దేశ విభజన సమయంలో హింస, ద్వేషం నీడన స్థానభ్రంశం చెందిన మ‌న‌ అసంఖ్యాక సోదర సోద‌రీమణులు మరియు వారి త్యాగాల జ్ఞాపకార్థం ఆగస్టు 14వ తేదీని 'విభజన గాయాల స్మృతి దినం'గా పాటించాలని శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయం

“ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ సున్నితమైన నిర్ణయం తీసుకోవ‌డాన్ని నేను స్వాగతిస్తున్నాను"

"దేశ విభజన గాయం మరియు ఈ సంద‌ర్భంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధను మాటల్లో వర్ణించలేము"

"విభజన గాయాల స్మృతి దినోత్స‌వం సమాజం నుండి వివక్ష మరియు దురుద్దేశాల‌ను
తొలగించడం ద్వారా శాంతి, ప్రేమ మరియు ఐక్యతను బలపరుస్తుందని నేను క‌చ్చితంగా న‌మ్ముతున్నాను"

Posted On: 14 AUG 2021 3:02PM by PIB Hyderabad

ఆగస్టు 14వ తేదీని 'విభజన గాయాల స్మృతి దినం'గా పాటించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా స్వాగ‌తించారు. దీనికి సంబంధించి శ్రీ అమిత్ షా ఒక ట్వీట్ చేశారు. “దేశ విభజన సమయంలో హింస మరియు ద్వేషం యొక్క నీడలో స్థానభ్రంశం చెందిన మా అసంఖ్యాకమైన సోదరీమణులు, సోదరుల త్యాగం మరియు వారి పోరాటం జ్ఞాపకార్థంగా శ్రీ నరేంద్ర మోదీ 14వ తేదీని 'విభజన గాయాల స్మృతి దినం'గా పాటించాలని నిర్ణయించుకున్నారు. ఈ సున్నిత నిర్ణయం తీసుకున్న‌ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చ‌ర్య‌ను నేను స్వాగతిస్తున్నాను” అని త‌న ట్వీట్‌లో మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి ఈ విష‌యంమై త‌న అభిప్రాయాన్ని తెలుపుతూ "దేశ విభజన గాయం మరియు ప్రియమైన వారిని కోల్పోయిన బాధను మాటల్లో వర్ణించలేనిది. సమాజం నుండి వివక్ష మరియు దురుద్దేశాన్ని తొలగించడం ద్వారా 'విభజన గాయాల స్మృతి దినం' శాంతి, ప్రేమ మరియు ఐక్యతను బలపరుస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాన‌ని అన్నారు.



(Release ID: 1745973) Visitor Counter : 172