సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రసారభారతి ద్వారా సులభంగా, సమ్మిళితంగా అందరకీ చేరేలా ఒలింపిక్స్ కవరేజ్- లక్షలాది మంది డిజిటల్ వీక్షణతో... హిట్

Posted On: 13 AUG 2021 12:17PM by PIB Hyderabad

2020 టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందం ఒలింపిక్స్‌లో భారతదేశానికి అనేక ఫస్ట్‌లు నమోదు చేసి విజయం సాధించింది. ఈ అపూర్వమైన ఫీట్ నవీన భారతదేశానికి కొత్త ఆశను కలిగించింది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఈ ఆశను భారతదేశం అంతటా అందుబాటులో ఉండే కవరేజ్ ద్వారా ప్రతి పౌరుడికి చేరువ చేయడంలో ఒక సమగ్ర పాత్ర పోషించిన ఆనందకరమైన తరుణమిది. 

మన ఛాంపియన్‌లు వివిధ ఒలింపిక్ ఈవెంట్‌లలో ఒక వెలుగు వెలిగించగా, ప్రసార భారతి తన ప్రసార, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, టీవీ, రేడియో, స్మార్ట్ ఫోన్‌ల ద్వారా ప్రతి ఇంటికి ఒలింపిక్ విజయ పరంపరను ప్రత్యక్షంగా అందించగలిగింది. 

రేడియో స్పోర్ట్స్ నెట్‌వర్క్ అన్ని వయస్సుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా వీక్షించేల బాగా ప్రాచుర్యం పొందింది. ఇది వివిధ యూట్యూబ్ ఛానెళ్లు, ప్రసార భారతి న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్ ద్వారా విస్తృతంగా ప్రజలకు చేరి లక్షలాది మంది డిజిటల్ వ్యూయర్‌షిప్‌ ని నమోదు చేసుకుంది. 

ఈ బృహత్తర కార్యక్రమం కవరేజ్ లెక్కలు చుస్తే..  

బాధ్యతాయుతమైన ప్రభుత్వ ప్రసార మాధ్యమంగా, ప్రసార భారతి దాని ప్రాప్యత కవరేజ్ మారుమూల ప్రాంతాలకే కాకుండా, విభిన్న ప్రతిభావంతులకు కూడా  అందుబాటులో ఉండేలా చేసింది. ఒలింపిక్ కవరేజ్ కోసం, ప్రసార భారతి 14 సంకేత భాషా కళాకారులను నియమించింది, వారు 240 గంటల ఒలింపిక్స్ లైవ్ కవరేజీని సంకేత భాషలో సమర్పించారు. మన రేడియో ప్రేక్షకుల కోసం, 16 ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతలు వివిధ ఒలింపిక్ ఈవెంట్‌లలో అను క్షణము ఏమి జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు.

 

టోక్యో ఒలింపిక్స్ 2020 కి సంబంధించిన ప్రభుత్వ ప్రసార మాధ్యమం డిజిటల్ కవరేజ్ సమగ్రమైనదిగాను, బహుముఖమైనది గాను ఉంది. లైవ్ ఒలింపిక్ క్రీడా ఈవెంట్‌లు కాకుండా, కవరేజీలో ప్రారంభ, ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారం, భారతీయ అగ్రశ్రేణి క్రీడాకారులతో ప్రత్యేకమైన వర్చువల్ కాన్క్లేవ్, జీవిత చరిత్రలు, భారతీయ ఒలింపిక్ బృందం సభ్యుల విజయ కథలు, దేశవ్యాప్తంగా వారి విజయాల వేడుకలు, మరెన్నో ఉన్నాయి. 

***



(Release ID: 1745530) Visitor Counter : 164