గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్వయం ఉపాధిపై గ్రామీణ యువతకు 87 సమీకరణ శిబిరాల నిర్వహణ!


‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా
ఆర్.ఎస్.ఇ.టి.ఐ.ల కసరత్తు..

మొత్తం 64కోర్సుల్లో 37.81లక్షల మందికి తర్ఫీదు...
స్వయం ఉపాధిలో స్థిరపడిన 26.65లక్షల మంది.

Posted On: 06 AUG 2021 12:34PM by PIB Hyderabad

    దేశం స్వాతంత్ర్యం సాధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట భారత ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో భాగంగా దేశంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు (ఆర్.ఎస్.ఇ.టి.ఐ.లు) 2021 జూలై 30నుంచి ఆగస్టు 5వరకూ దేశవ్యాప్తంగా 87 ‘సమీకరణ శిబిరాల’ను నిర్వహించాయి. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను జన ఉత్సవాలుగా, జనోద్యమాలుగా ప్రజా భాగస్వామ్య (జన భాగీర్దారీ) స్ఫూర్తితో దేశం నలుమూలలా నిర్వహించబోతున్నారు. 

  అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా 19 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 87 జిల్లాల్లో మొత్తం 87 సమీకరణ శిబిరాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఈ సమీకరణ శిబిరాల్లో పాల్గొన్న వారందరికీ స్వయం ఉపాధికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం, మాస్కులు, రేషన్ సరకుల పంపిణీ తదితర కార్యకలాపాలనుంచి తాము ఎంపిక చేసుకోవలసిన అంశాలపై శిబిరాల్లో పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. 

   ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఇ.టి.ఐ.ల ఆధ్వర్యంలో 37.81లక్షలమందికి 64 అధ్యయన కోర్సుల్లో శిక్షణ కల్పించారు. ఈ కోర్సుల్లో జాతీయ నైపుణ్య అర్హతా ప్రమాణాల వ్యవస్థ (ఎన్.ఎస్.క్యు.ఎఫ్.)కు అనుసంధానమైన 59 కోర్సులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించిన 5 కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా 26.65లక్షల మంది అభ్యర్థులు స్వయం ఉపాధిలో స్థిరపడిపోయారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. 585 ఆర్.ఎస్.ఇ.టి.ఐ.ల ఆధ్వర్యంలో, 23 ప్రధాన బ్యాంకుల సౌజన్యంతో కార్యక్రమాలను చేపట్టారు. (ప్రభుత్వ రంగ బ్యాకులు, ప్రైవేటు బ్యాంకులతోపాటుగా కొన్ని గ్రామీణ బ్యాంకులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.)

   ఆర్.ఎస్.ఇ.టి.ఐ.లు లేదా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను త్రైపాక్షిక భాగస్వామ్యంతో చేపడతారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, స్పాన్సార్డ్ బ్యాంకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయి. గ్రామీణ యువత తమంతట తాముగా సొంతంగా ఉపాధిని కల్పించుకునేందుకు, ఔత్సాహిక వాణిజ్య సంస్థలను నెలకొల్పుకొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇచ్చేందుకు వీలుగా బ్యాంకులు తప్పనిసరిగా తమ లీడ్ జిల్లాకు ఒకటి చొప్పున ఆర్.ఎస్.ఇ.టి.ఐ.లను ప్రారంభించాలన్న నిబంధన విధించారు. వివిధ ఔత్సాహికుల మద్దతు, మార్గదర్శకత్వంలో స్వల్ప వ్యవధి శిక్షణ లక్ష్యంగా ఆర్.ఎస్.ఇ.టి.ఐ. ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని 18-45 సంవత్సరాల పేద యువత ఈ శిక్షణా కార్యక్రమాలకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదవర్గాలకు చెందిన యువజనుల ఆశలను నెరవేర్చడం, వారికి వివిధ రంగాల్లో శిక్షణ అందించి, ఔత్సాహిక వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాల నిర్వహణలో ఆర్.ఎస్.ఇ.టి.ఐ.లు ఇప్పటికే  తమ సత్తాను నిరూపించుకున్నాయి.

  ఈ శిక్షణా కార్యకలాపాల కోసం సమీకరణ శిబిరాలు చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. అర్హులైన అభ్యర్థులను చేరుకుని, ఈ పథకం గురించి, అవకాశాల గురించి వారికి తెలియజెప్పడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.

https://ci5.googleusercontent.com/proxy/9sGQGQEgJCFH6zmqCEngWa02kKgo6SS2lgQ0AhStuALk5_4NhhCnGvAUpXq3x2JmIMitZ9EmvIGqOjR6D7aECzyYI_EbI_AVIxTDLUYe6wqGPvRCM1gXzq6HHQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00185OX.jpg

ఆర్.ఎస్.ఇ.టి.ఐ., చంపావత్

https://ci3.googleusercontent.com/proxy/eUKjzF0XNsNiXLe2urYps-WPVU5SuY9TxRm78iy1UchZmdaFpfPO6ulenSStLMtbTh8cZZNY0lf5uVW2q-DTJRWQSWt_u_vosL7FEWxYIHrZm261kA0VfNn9nA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KE94.jpg

ఆర్.ఎస్.ఇ.టి.ఐ., హాజీపూర్r

 

https://ci5.googleusercontent.com/proxy/vS-TI9IjxuvIvHA4JwyhJDo2Nm-zHMLvclRiDE77ga-8ez1IgeOLtp74PneR-bvICffPeBfW9IRrlMya8lEzw3uYfzfoNTGmi-vbjgMSd1HSWu-8VbtI0GOZfw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00388D7.jpg

ఆర్.ఎస్.ఇ.టి.ఐ., దుర్గ్.

https://ci5.googleusercontent.com/proxy/8M6BfhSX8FpHQA3Wkx-BZIUcMzAsHQsYK4_J2DA3FAdCOO-fVEv7jzPsuIyJJ7YWXu_JW1ya7DVpedHBy6ZVF_n7_rm-rVVpBU1DqcdvLQg6YF8rYTkwC1Yi9A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004SMA6.jpg

ఆర్.ఎస్.ఇ.టి.ఐ., హరిద్వార్

 

 

***


(Release ID: 1743237) Visitor Counter : 187