ప్రధాన మంత్రి కార్యాలయం

విదేశాల లోని ఇండియన్ మిషన్ ల ప్రధాన అధికారుల తో, వ్యాపారం- వాణిజ్యం రంగ ప్రముఖుల తో ఆగస్టు 6 న సమావేశం కానున్న ప్రధాన మంత్రి; ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటి సారి


‘లోకల్ గోస్ గ్లోబల్-మేక్ ఇన్ ఇండియా ఫార్ ద వరల్డ్’ అని పిలుపు ను ఇవ్వనున్న ప్రధాన మంత్రి

Posted On: 05 AUG 2021 10:05PM by PIB Hyderabad

విదేశాల లోని ఇండియన్ మిషన్స్ ప్రధాన అధికారుల తోను, దేశం లోని వ్యాపారం- వాణిజ్యం రంగాని కి చెందిన ప్రముఖుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం అంటే ఈ నెల 6 వ తేదీ న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ‘లోకల్ గోస్ గ్లోబల్- మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్’ అంటూ ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పిలుపు ను ఇవ్వనున్నారు.  

భారీ స్థాయి లో అవకాశాల ను కల్పించే సామర్థ్యం ఎగుమతుల కు, ప్రత్యేకించి, ఎమ్ఎస్ఎమ్ఇ లకు, మానవ శ్రమ ప్రధానం గా ఉండే రంగాల కు ఉంది.  ఈ విషయంలో అవి అందించే తోడ్పాటు తో తయారీ రంగం పైన, మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ పైన ఒక  సానుకూలమైన ప్రభావం ప్రసరించగలదు.  ఈ సమావేశం పరమార్థం ఏమిటి అంటే అది భారతదేశాని కి గల ఎగుమతుల  స్తోమత ను  వినియోగించుకోవడానికి, భారతదేశం ఎగుమతుల ను, ప్రపంచ వ్యాపారం లో భారతదేశం ఎగుమతుల వాటా ను విస్తరించడానికి ప్రత్యేకంగా జోరు ను అందించాలి అనేదే.

మన ఎగుమతులకు ఉన్న అవకాశాలను పెంచే దిశ లో, మరి అలాగే ప్రపంచ గిరాకీ ని తీర్చడం కోసం స్వదేశీ సామర్థ్యాల ను ఉపయోగించుకొనే దిశ లో సంబంధిత వర్గాలు అన్నిటి కి శక్తి మంతం చేయాలన్నది ఈ సమావేశం ధ్యేయం గా ఉంది.

ఈ సమావేశం లో కేంద్ర వాణిజ్య మంత్రి తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి కూడా పాల్గొంటారు.  ఈ సమావేశం లో 20 కి పైగా విభాగాల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఎగుమతి ప్రోత్సాహక మండలుల సభ్యులు, వాణిజ్య మండలుల సభ్యులు కూడా పాలుపంచుకోనున్నారు.


 

***



(Release ID: 1743108) Visitor Counter : 192