ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మరణాలు అపోహలు,- వాస్తవాలు
అన్ని రాష్ట్రాలు జిల్లాలవారీగా కోవిడ్ -19 కేసులు, మరణాల సంఖ్యను రోజువారీ ప్రాతిపదికన హైలైట్ చేయాలని సూచించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం మరణాలను నమోదు చేయాల్సిన అవసరం గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. ఇందుకు సంబంధించి సమాచారం పంపడం, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించడం, కేంద్ర
బృందాల నియామకం ద్వారా ఈ సూచనలు చేసింది.
చట్టాలకు అనుగుణంగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) కింద జనన, మరణాలను దేశంలో నమోదు చేయడం జరుగుతోంది.
Posted On:
04 AUG 2021 1:03PM by PIB Hyderabad
ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కోవిడ్ -19 మరణాల సంఖ్య తక్కువగా లెక్కకడుతున్నారని అంటూ ఊహాజనిత మీడియా కథనాలు కొన్ని వస్తున్నాయి. మరణాల సంఖ్యను అంచనా వేయాల్సి వస్తున్నదని, వాస్తవ సమాచారం ఎన్నటికీ తెలిసే అవకాశంలేదని కూడా చెబుతున్నారు. ఇలాంటి రిపోర్టులో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ ఎస్), హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్)కు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో అన్ని రకాల మరణాలకు సంబంధింఇన గణాంకాలు ఉంటాయి. దీనితో లెక్కలోకి రాని వారినిలెక్కిస్తున్నామన్న భ్రమలో పొరపాటు నిర్ధారణకు వస్తున్నారు.
దేశంలో చట్టం ప్రకారం నిర్వహిస్తున్న మరణాల రిజిస్టర్ ఉంది. సాంక్రమిక వ్యాధుల కు సంబంధించిన కొన్ని సూత్రాల ప్రకారం అవి గుర్తింపబడకపోవచ్చు కాని మరణాల లెక్కలో అవి లేకుండా ఉండడం జరగదు.దీనిని మరణాల రేటులో చూడచ్చు. 2020 డిసెంబర్ 31న కేసుల మరణాల రేటు 1.45 శాతం ఉండగా, సెకండ్ వేవ్‌లో ఏప్రిల్ -మే 2021 మధ్య అనూహ్యంగా కేసుల సంఖ్య పెరిగినా మరణాల రేటు 1.34 శాతం మాత్రమే ఉంది.
దీనికితోడు, ఇండియాలో రోజువారి కేసులు, మరణాలు బాటమ్ అప్ అప్రోచ్‌ని అనుసరిస్తాయి. ఇందులో జిల్లాలు కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను రాష్ట్రప్రభుత్వానికి నివేదిస్తాయి. రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరంతర ప్రక్రియగా పంపుతుంది. 20120 మే లో ఇందుకు సంబంధించిన గందరగోళం , లేకుండా చసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎంఆర్) కోవిడ్ -19 సంబంధిత మరణాల నమోదుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఐసిడి-10 కు అనుగుణంగా కోవిడ్ మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన సూచనలు చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ విషయమై నిరంతరం తగిన సూచనలు చేయడంతోపాటు వీడియో కాన్ఫరెన్సులు, కేంద్ర బృందాల నియామకం వంటి వాటిద్వారా కోవిడ్ మరణాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నమోదు అయ్యేట్టు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. రాష్ట్రాలను తమ ఆస్పత్రులలో ఇందుకు సంబందించిన మార్గదర్శకాల ప్రకారం ఆడిట్ నిర్వహించి ఆయా కేసులు లేదా మరణాలను నమోదు చేయాలని దీనివల్ల డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని సూచించడం జరిగింది.
ఖచ్చితమైన సమాచారం నమోదుకు సంబంధించిన ఆవశ్యకతను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నది, రోజు వారీగా జిల్లా స్థాయిలో మరణాలను , కేసుల పర్యవేక్షణ చేస్తున్నది. తక్కువ మరణాలు నమోదు అవుతున్న రాష్ట్రాలను తమ లెక్కలు సరిచూసుకోవలసిందిగా కూడా సూచించడం జరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బీహార్ ప్రభుత్వానికి జిల్లాల వారిగా కోవిడ్ కేసులు, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరడం జరిగింది.
.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపే సమాచారానికి తోడు చట్టబద్దంగా గల సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) కింద జననాలు, మరణాలను దేశంలో నమోదుచేస్తారు. సిఆర్ఎస్ డాటా సేకరణ, తనిఖీ, సరిచూడడం, వాటిని ప్రచురించడం వంటివి చేపడుతుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ అయినప్పటికీ మరణాలకు సంబందించిన గణాంకాలు లెక్కలలో చేరని పరిస్థితి లేకుండా చూస్తారు. పెద్త ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నందున ఇందుకు సంబంధించిన గణాంకాలను సాధారణంగా మరుసటి సంవత్సరరం ప్రకటిస్తారు. దీనిని మీడియా నివేదికలో కూడా ప్రస్తావించడం జరిగింది.
కోవిడ్ రెండో వేవ్ తీవ్రస్థాయిలొ ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా మన ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ పై దృష్టిపెట్టింది. అత్యవసర వైద్యసహాయం అవసరమైన వారిపై దృష్టిపెట్టవలసిన పరిస్థితులలో ఖచ్చితమైన రిపోర్టింగ్, కోవిడ్ మరణాల నమోదు లో కాస్త జాప్యం జరిగి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సక్రమంగానే నమోదుచేశాయి. మరణాల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడం నిరంతరాయంగా జరుగుతోది. కోవిడ్ మరణాలు తక్కువగా నమోదు అయ్యే అవకావం ఉందన్న అపోహలను కొట్టివేస్తూ గణాంకాలను జాగ్రత్తగా సేకరిస్తున్నారు.
సుదీర్ఘకాలం కోవిడ్ వంటి ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పుడు మరణాల రేటు నమోదులోఎప్పుడూ కొద్దిగా తేడాలు కనిపించవచ్చు. మరణాలకు సంబంధించిన నమ్మకమైన సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణంగా మరణాలపై అధ్యయనాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన పరిశోధనల పద్ధతులు స్పష్టంగా నిర్వచింపబడి ఉన్నాయి. డాటా సోర్సులు కూడా నిర్వచించి ఉన్నారు.
***
(Release ID: 1742367)
Visitor Counter : 487