సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం జనవరి 23 వ తేదీని పరాక్రం దివస్‌గా ప్రకటించింది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 02 AUG 2021 3:19PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు :

 - నేతాజీ 125 వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను ఆమోదించింది 

 - న్యూ ఢిల్లీలోని ఎర్రకోటలోనేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది 

 - జనవరి 23ని  పరాక్రం దివస్‌గా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి ఉత్సవాలను  భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది.  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం 23 జనవరి 2021 న కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో జరిగింది. దీనికి గౌరవనీయులైన ప్రధాని అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక నాణెం మరియు స్టాంపులను  విడుదల చేశారు. ఉత్సవాల్లో భాగంగా  23 జనవరి 2021 న కోల్‌కతా,  5 మార్చి 2021 జబల్‌పూర్‌లో అంతర్జాతీయ సెమినార్లు  నిర్వహించబడ్డాయి.

ఉత్సవాల నిర్వహణకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో విశిష్ట వ్యక్తులుచరిత్రకారులురచయితలునిపుణులునేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్ తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 23 వ తేదీని పరాక్రమం దివస్‌గా గుర్తిస్తూ 19 జనవరి, 2021 న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన అనేక ప్రతిపాదనలను భారత ప్రభుత్వం ఆమోదించింది.  ఎర్రకోట,కోల్‌కతా సమీపంలోని   నీల్‌గంజ్ లో     ఐఎన్ఏ అమరవీరుల స్మారక స్థాపన  నేతాజీ మరియు ఐఎన్ఏ  లపై లఘు  వీడియోలు ఐఎన్ఏ  ట్రయల్స్‌పై డాక్యుమెంటరీకల్నల్ ధిల్లాన్ జీవిత చరిత్ర ప్రచురణ మరియు  జనరల్ షానవాజ్ ఖాన్ పిల్లలకు అర్థమయ్యేలా నేతాజీపై  స్నేహపూర్వక కామిక్స్చిత్ర పుస్తకం రూపంలో  ఐఎన్ఏ ఫోటోలను ప్రచురించడం లాంటివి దీనిలో ఉన్నాయి.   ప్రభుత్వం  భారతదేశం నేతాజీ  ఐఎన్ఏలకు  సంబంధంసంబంధించి ముఖ్యమైన తేదీలను గుర్తు చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.  బ్రిటిష్ సైన్యం భారత గడ్డపై ఓడిపోయిన  -14 ఏప్రిల్ న మొయిరాంగ్ డే ఐఎన్ఏ   రైజింగ్ డే -21 అక్టోబర్నేతాజీ అండమాన్ వెళ్ళి  జెండాను ఆవిష్కరించడం  -30 డిసెంబర్,   ఇంఫాల్ కోసం   ఐఎన్ఏ పోరాటం చేయడాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమాల నిర్వహణ. 

 

న్యూఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం  ఏర్పాటు చేయబడింది.  ప్రస్తుతం కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో సుభాష్‌పై విస్తృత ప్రదర్శన జరుగుతోంది.

* నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో కింది సంస్థలు ఉన్నాయి:

 

           *నేతాజీ సుభాస్ విశ్వవిద్యాలయంపోఖారిజంషెడ్‌పూర్

 

            * నేతాజీ సుభాస్ ఓపెన్ యూనివర్సిటీకోల్‌కతా

 

             * నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీన్యూఢిల్లీ

 

             *  నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్పాటియాలా.

 

 ఈ సమాచారాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్ సభలో లిఖితపూర్వకంగా ఇచ్చారు.

***



(Release ID: 1741686) Visitor Counter : 295