ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ పాజిటివ్ గల తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చును
పాలు ఇవ్వని సమయంలో బిడ్డకు తనకు ఆరు అడుగుల దూరంలో ఉండాలి
డాక్టర్ మంజు పూరి, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగ అధిపతి , లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్,న్యూఢిల్లీ
"ఒక నిర్దిష్ట వ్యాధికారకానికి వ్యతిరేకంగా శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి వ్యాక్సిన్ సహాయపడుతుంది, ఇది ఇతర శరీర కణజాలాలను ప్రభావితం చేయదు"
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత తల్లి మరియు పిండం ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి మొత్తం ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించిన డాక్టర్ మంజు పూరి
Posted On:
26 JUL 2021 1:28PM by PIB Hyderabad
గర్భధారణ సమయంలో మహిళలు కోవిడ్ -19 టీకాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మహిళలు తమను తాము కోవిడ్ నుంచి రక్షించుకుంటూ తమ పిల్లల సంరక్షణకు ఎటువంటి చర్యలను తీసుకోవాలన్న అంశంపై న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగ అధిపతి డాక్టర్ మంజు పూరి సూచనలు, సలహాలు ఇచ్చారు.
గర్భధారణ సమయంలో కూడా స్త్రీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది వారికి ఎలా సహాయపడుతుంది?
కోవిడ్ మొదటి దశతో పోల్చి చూస్తే రెండవ దశలో ఎక్కువ మంది మహిళలకు గర్భధారణ సమయంలో కోవిద్ -19 సోకింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో గర్భాశయం విస్తరించియోని ద్వారమును మూయటానికి ఉపయోగించే సంతాన నిరోధక పరికరము మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది. దీనితో మహిళ శరీరంలో ఆక్సిజన్ సాంద్రత తగ్గుతుంది. దీనితో రక్త ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవడానికి దారితీస్తుంది. దీనితో తల్లి మరియు బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన వ్యాధులు సోకకుండా నివారించే అంశంలో వ్యాక్సిన్లు సహాయపడతాయి.
తల్లికి టీకా వేయడం వల్ల నవజాత శిశువుకు కొంత రక్షణ లభిస్తుంది. ఎందుకంటే టీకా తీసుకున్న తరువాత తల్లి శరీరంలో అభివృద్ధి చెందిన ప్రతిరోధకాలు ఆమె రక్తం ద్వారా గర్భంలో పెరుగుతున్న పిండానికి చేరుతాయి. పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లుల విషయంలో శిశువుకు తల్లి పాల ద్వారా ఈ ప్రతిరోధకాలు లభిస్తాయి.
టీకాలు మహిళల్లో వంధ్యత్వానికి దారి తీస్తాయని కొందరు నమ్ముతారు. ఇది నిజమా?
ఇది సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న పుకార్లు. వైరస్ కంటే తప్పుడు సమాచారం చాలా ప్రమాదకరమైనది.
కోవిడ్ -19 టీకాలు కొత్తవి అయినప్పటికీ, ఇవి అనేక పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేయబడ్డాయి. టీకా ద్వారా శరీరం ఒక నిర్దిష్ట వ్యాధికారకానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. ఇది ఇతర శరీర కణజాలాలను ప్రభావితం చేయదు. వాస్తవానికి, గర్భధారణ సమయంలో కూడా మహిళలు మరియు వారి పుట్టబోయే బిడ్డను వివిధ వ్యాధుల నుంచి రక్షించడానికి హెపటైటిస్ బి, ఇన్ఫ్లుఎంజా, పెర్టుస్సిస్ వ్యాక్సిన్ వంటి కొన్ని టీకాలను మేము ఇస్తాము.
టీకాల భద్రతపై నమ్మకం ఏర్పడిన తరువాత మాత్రమే గర్భధారణ సమయంలో టీకాలు వేయడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయని చూపించే శాస్త్రీయ సమాచారం లేదా అధ్యయనాలు లేవు. ఈ టీకాలు పునరుత్పత్తి అవయవాలను ఏ విధంగానూ ప్రభావితం చేయవు.
కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భం మరియు ప్రసవం మన సమాజంలో అందరి మధ్య జరుపుకునే వేడుకలు. మహమ్మారి సమయంలోఇటువంటి వేడుకలను నిర్వహించడం అంటే తల్లి మరియు బిడ్డలను వ్యాధి సోకడానికి పరిస్థితి కల్పించడమే అవుతుంది. మాతృత్వానికి దగ్గర అవుతున్న మహిళ ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్క్ ధరించాలని, కుటుంబ సభ్యులతో శారీరక దూరాన్ని కొనసాగించాలి. ఆమె బయటకు వెళ్ళక పోవచ్చు కానీ పని కోసం బయటికి వెళ్లి వచ్చే ఆమె కుటుంబ సభ్యుల ద్వారా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.
మహిళలు గర్భధారణ సమయంలో కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల ప్రసవం తర్వాత ఇదిఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలను తగ్గిస్తుంది.
కోవిడ్ -19 లక్షణాలు కనిపిస్తే గర్భిణీ స్త్రీలు ఏమి చేయాలి?
కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారు సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. గుర్తించిన వెంటనే చికిత్స అందించడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో అందించే కోవిడ్ చికిత్స ఇతరులతో సమానంగా ఉంటుంది. అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాల్సి ఉంటుంది.
కోవిడ్ సోకిన మహిళ విడిగా ఉంటూ పుష్కలంగా ద్రవాలు తాగుతూ ఉండాలి. ప్రతి 4-6 గంటలకు ఆమె ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. పారాసెటమాల్ తీసుకున్న తర్వాత కూడా ఉష్ణోగ్రత తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. ఆక్సిజన్ స్థాయి తగ్గినా లేదా తగ్గుతున్నట్టు కనిపించినా అంటే ఉదయం 98, సాయంత్రం 97 ఉంటూ మరుసటి రోజు మరింత పడిపోతే ఆమె తన వైద్యుడిని సంప్రదించాలి.
డయాబెటిస్, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి,చికిత్సా కాలంలో వైద్యుని సలహాలు సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత తల్లి మరియు పిండం ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి మొత్తం ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
తల్లి నుంచి పిండానికి కోవిడ్ -19 సంక్రమిస్తుందా ?
ఈ ఆందోళనకు ఆధారాలు లేవు. ఈ అంశంపై మేము అధ్యయనాలు చేసాము. పిండం పెరిగే గర్భాశయంలో ఏర్పడే మావి అనే అవయవం రక్షణ కవచంగా పనిచేస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.కొత్తగా పుట్టిన వారికి వ్యాధి సోకిన సందర్భాలు ఉన్నాయి, కాని ఆ పిల్లలకు తల్లి గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చిందా అనే అంశంపై స్పష్టత లేదు.
దీనిని దృష్టిలో ఉంచుకుని తనను మరియు తన బిడ్డను అనేక విధాలుగా ప్రభావితం చేసే కోవిడ్-19 సోకకుండా చూసుకోవడానికి స్త్రీలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నవజాత శిశువును రక్షించడానికి కోవిడ్ పాజిటివ్ గల తల్లి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
శిశువుకు పాలివ్వడాన్ని తల్లి కొనసాగించాలి. తల్లి పాలివ్వనప్పుడు శిశువును ఆమె నుండి 6 అడుగుల దూరంలో ఉంచమని సూచిస్తున్నాము. నెగటివ్ గా తేలిన సంరక్షకుడు నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడ వచ్చును. నవజాత శిశువుకు పాలిచ్చే ముందు చేతులు కడుక్కోవాలి, మాస్క్ , ఫేస్ షీల్డ్ వంటి రక్షణ పరికరాలను ధరించాలి. పరిసరాలను కూడా తరచుగా శుభ్రపరచాలి.
పిల్లల సంరక్షణ కోసం ఇంట్లో మరెవరూ లేకపోతే తల్లి అన్ని సమయాల్లో మాస్క్ వేసుకోవాలి. పిల్లల నుండి శారీరక దూరాన్ని వీలైనంత వరకు కొనసాగించాలి. తల్లి మరియు బిడ్డ ఎక్కువ గాలి వెలుతురు ఉన్న గదిలో ఉండాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి మరియు పరిసరాలను శుభ్రపరచాలి.
ప్రసవానంతర నిరాశ మరియు ఆందోళన మహిళల్లో సాధారణం. మహమ్మారి సమయంలో మహిళల మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగినట్టు మీరు గమనించారా ?
గర్భధారణ సమయంలో మరియు ప్రసవానంతర కాలంలో మహిళల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ సమయంలోమహిళల్లో హార్మోన్ల మరియు శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. వీటిని తట్టుకునే సామర్ధ్యం వారికి ఉండదు. ఈ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఈ మద్దతు లేనప్పుడు ఆమె ఒంటరిగా, నిస్సహాయంగా, నిరాశకు గురవుతుంది.
15 రోజుల పాటు ఒంటరిగా ఉండటం అందరికీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవానంతర తల్లులకు కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ఆలోచిస్తూ ఆమె మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వీడియో కాల్స్ ద్వారా మరింత సన్నిహితంగా ఉండాలి.ఆమె మానసిక స్థితిలో ఏదైనా మార్పు వచ్చినా లేదా ఆమె నిరాశకు గురైనట్లు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి.
మేము ఎల్లప్పుడూ మా గర్భిణీ స్త్రీలను మరియు తల్లులను రెండు సాధారణ ప్రశ్నలను అడుగుతాము. ఒకటి, ఆమె తన సాధారణ పనులను చేయటానికి తక్కువ లేదా అస్సలు ఆసక్తి కనబరచడం లేదా ? రెండవది, గత 2 వారాలలో ఎప్పుడైనా ఆమె నిర్దిష్ట కారణం లేకుండా విచారంగా ఉందా లేదా ఏడుస్తున్నట్లు అనిపిస్తుందా? ఈ ప్రశ్నలలో దేనినైనా సమాధానం అవును అయితే ఆమె మనస్తత్వవేత్త పర్యవేక్షణ అవసరం ఉంటుంది. ఈ సమయంలో వైద్యులు, అలాగే కుటుంబ సభ్యులు స్త్రీ ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
మహిళా రోగులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి ?
సురక్షితంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ అనుగుణ ప్రవర్తనను అలవర్చుకోవాలని మేము సూచిస్తున్నాము. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోండి. ఎక్కువ మందిని కలవడం మానుకోండి.
జ్వరం, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం లేదా కోవిడ్ లక్షణాలు కనిపించినప్పుడు కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలసి ఉంటే వారు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. రోగ నిర్ధారణ ఆలస్యం చేయకూడదు మరియు స్వీయ చికిత్స చేయకూడదు. చివరగా, మేము గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో వివిధ గర్భనిరోధక పద్ధతుల గురించి సలహా ఇస్తూ ప్రసవానంతర ఇంట్రా-గర్భాశయ పరికరం (Cu T) ను అందిస్తున్నాము, వీటిని ప్రసవ లేదా సిజేరియన్ డెలివరీ అయిన వెంటనే చేర్చవచ్చు. ఇది ప్రసవ తర్వాత అనవసరంగా ఆసుపత్రికి రాకుండా చేయడమే కాకుండా ప్రణాళిక లేకుండా గర్భం దాల్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.
***
(Release ID: 1739122)
Visitor Counter : 565