ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 43.51 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ కోలుకున్నవారి శాతం 97.35%


గత 24 గంటల్లో 39,361 కొత్త కోవిడ్ కేసులు

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,11,189; మొత్తం కేసుల్లో 1.31%

రోజువారీ పాజిటివిటీ 3.41%; 49 రోజులుగా 5% లోపే

Posted On: 26 JUL 2021 10:26AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 43.51 కోట్లు దాటింది. 52,95,458 శిబిరాల ద్వారా మొత్తం 43,51,96,001 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో  18,99,874 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:    

 

  

 ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,87,343

రెండో డోస్

77,06,397

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,78,56,000

రెండో డోస్

1,08,45,879

18-44 వయోవర్గం

మొదటి డోస్

13,91,72,057

రెండో డోస్

62,18,541

45-59 వయోవర్గం

మొదటి డోస్

10,09,68,508

 రెండో డోస్

3,45,89,799

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,35,18,799

రెండో డోస్

3,40,32,678

మొత్తం

43,51,96,001

    

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 3,05,79,106 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 35,968 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.35% అయింది.

 

 

 గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  39,361 కొత్త కేసులు నమోదయ్యాయి. 29రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది

 

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,11,189 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.31% మాత్రమే

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 11,54,444 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 45.74 కోట్లకు పైగా (45,74,44,011) అయ్యాయి.

 

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.31% కాగా రోజువారీ పాజిటివిటీ  3.41%  అయింది. వరుసగా 49 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది

 

***

 

 



(Release ID: 1739100) Visitor Counter : 182