ప్రధాన మంత్రి కార్యాలయం

ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినం కార్యక్రమం లో ప్రధాన మంత్రి సందేశం


కరోనా కాలం లో భగవాన్ బుద్ధుడు మరింత ఎక్కువ సందర్భశుద్ధి కలిగిన వారు గా మారారు: ప్ర‌ధాన మంత్రి

బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తూ అత్యంత కఠినమైన సవాలు ను అయినా సరే మనం ఎలాగ ఎదుర్కోగలుగుతామో భారతదేశం చాటిచెప్పింది: ప్ర‌ధాన మంత్రి

విషాదభరిత కాలం లో, ప్రపంచం ఆయన బోధనల కు ఉన్న శక్తి ని గ్రహించింది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 JUL 2021 8:58AM by PIB Hyderabad

భగవాన్ బుద్ధుడు ప్రస్తుతం కరోనా మహమ్మారి తాలూకు సంకటపూర్ణమైన కాలం లో   మరింత ఎక్కువ పొంతన కలిగిన వారు గా మారారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  బుద్ధుడు చూపించిన దారి లో నడచి వెళ్తూ అత్యంత కఠినం అయినటువంటి సవాలు ను అయినా సరే, మనం ఎలాగ ఎదుర్కోగలుగుతామో భారతదేశం చాటి చెప్పింది.  బుద్ధుని బోధనల ను అనుసరిస్తూ యావత్తు ప్రపంచం అఖండ సంఘీభావం తో ముందుకు సాగిపోతోంది.  ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినం కార్యక్రమం లో ప్రధాన మంత్రి తాను ఇచ్చిన సందేశం లో ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కాన్ ఫెడరేశన్ చేపట్టినటువంటి ‘కేర్ విత్ ప్రేయర్’ కార్యక్రమం ప్రశంసార్హం గా ఉందని పేర్కొన్నారు.
 

మన మనస్సు కు, మన వాణి కి మధ్య సామంజస్యం, మరి అంతేకాకుండా మన కార్యాలు మన ప్రయాస ల మధ్య సంకల్పం అనేవి మనల ను దు:ఖం నుంచి దూరం గా పోయేందుకు, సంతోషం వైపున కు తీసుకుపోవడం లో మార్గాన్ని చూపగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇది మనల ను మంచి కాలాల్లో జన సంక్షేమానికై పాటు పడేందుకు ప్రేరణ ను అందిస్తుంది, మనం కఠిన కాలాల ను ఎదుర్కొనేందుకు శక్తి ని కూడా ప్రసాదిస్తుంది.  భగవాన్ బుద్ధుడు మనకు ఈ సద్భావాన్ని సాధించుకోవడం కోసం ఎనిమిది విధాలైన మార్గాలను అందించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
 


బుద్ధుడు త్యాగం, సహనం ల యొక్క  అగ్ని లో తపించుకుపోయిన బుద్ధుడు ఎప్పుడైతే  మాట్లాడడం మొదలుపెడతారో, అప్పుడు అవి కేవలం మాటలుగా బయటకు రావు.. అప్పుడు యావత్తు ‘ధమ్మం’ తాలూకు చక్రం తిరుగాడడం మొదలు పెడుతుంది, మరి ఆయన వద్ద నుంచి ప్రవహించేటటువంటి జ్ఞానం విశ్వ కల్యాణానికి సమానమైన పదం గా మారిపోతుంది.  ఈ కారణం గానే ఇవాళ ఆయన కు అనుచరులు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు.
 


శత్రుత్వం తో శత్రుత్వం సమాప్తం కాదు అని ‘ధమ్మ పదా’న్ని ఉట్టంకిస్తూ శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.  అందుకు బదులు గా, ప్రేమ తో, పెద్ద మనస్సు తో, సద్భావం తో శత్రుత్వాన్ని శాంతింపచేయవచ్చును.  విషాదం ఆవరించిన కాలాల్లో, ప్రపంచం ఈ ప్రేమ, సద్భావాల తాలూకు శక్తి ని అనుభూతించింది.  బుద్ధుడు అందించినటువంటి ఈ జ్ఞానం తో మానవాళి యొక్క ఈ అనుభవం సమృద్ధం అయింది అంటే మరి దాంతో లోకం సఫలత తాలూకు, సమృద్ధి తాలూకు కొత్త శిఖరాల ను అందుకొంటుంది అని చెప్తూ ప్రధాన మంత్రి తన సందేశాన్ని ముగించారు.  


 

***
 



(Release ID: 1738675) Visitor Counter : 166