రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అత్యవసర ఉపశమన సామగ్రిని తీసుకొని జకార్త చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్
Posted On:
24 JUL 2021 11:40AM by PIB Hyderabad
భారతీయ నావికాదళానికి చెందిన నౌక ఐరవత్, కోవిడ్-19 అత్యవసర సహాయపు సామగ్రిని తీసుకొని 24 జూలై 2021న ఇండోనేషియాలోని జకార్తా నౌకాశ్రయానికి చేరుకుంది. ప్రస్తుతం
కొనసాగుతున్న మహమ్మారికి వ్యతిరేకంగా ఇండోనేషియా జరుపుతున్న పోరుకు మద్దతుగా ఈ ఓడ 100 మెట్రిక్ టన్నుల ద్రవీకృత ఆక్సిజన్‌ను, 300 కాన్సంట్రేటర్లను కలిగి ఉన్న దాదాపు ఐదు క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకొని జకార్తా చేరుకుంది. ఐఎన్ఎస్ ఐరవత్ ఒక ల్యాండింగ్ షిప్ ట్యాంక్ (పెద్ద) రకం, ఇది ఉభయచర కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రాథమిక పాత్ర కలిగి ఉంది. బహుళ ట్యాంకులు, ఉభయచర వాహనాలు మరియు ఇతర సైనిక సరుకులను మోయగల సామర్థ్యం ఈ నౌక సోంతం. ఈ నౌక హెచ్ఏడీఆర్ సహాయక చర్యల కోసం కూడా మోహరించబడింది. హిందూ మహాసముద్రం ప్రాంతంలోని వివిధ సహాయక చర్యలలో భాగంగా ఇది కొనసాగుతోంది. భారతదేశం, ఇండోనేషియా దేశాలు దగ్గరి సాంస్కృతిక మరియు వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. సురక్షితమైన ఇండో-పసిఫిక్ వైపు ఇరు దేశాలు సముద్ర డొమైన్‌లో కలిసి పని చేస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన నావికాదళాలు క్రమం తప్పకుండా ఉమ్మడి నావికాదళ ఎక్సర్‌సైజ్‌లను, ద్వైపాక్షిక ఎక్సర్‌సైజ్‌లను సమన్వయపు గస్తీ రూపంలో నిర్వహిస్తూ వస్తున్నాయి.
*****
(Release ID: 1738671)
Visitor Counter : 187