రైల్వే మంత్రిత్వ శాఖ

తొలిసారిగా, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ 10 కంటైనర్ల ద్వారా 200 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను బంగ్లాదేశ్‌కు రవాణా చేయనున్న భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా సాయం అందిస్తూనే ఉన్న రైల్వేలు

Posted On: 24 JUL 2021 1:03PM by PIB Hyderabad

భారత ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బంగ్లాదేశ్‌కు ప్రయాణం కానుంది. పొరుగు దేశానికి సాయమందించే ఆపరేషన్‌లో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను రంగంలోకి దించడం ఇదే మొదటిసారి. ఆగ్నేయ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లోని టాటా ప్లాంటుకు 200 మె.ట. (ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ ఎల్‌ఎంవో) రవాణా కోసం ఈ ఇండెంట్‌ వచ్చింది. బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు ఈ ఆక్సిజన్‌ను రవాణా చేయనున్నారు.

    10 కంటైనర్ల రేక్‌లో 200 మె.ట. ఎల్‌ఎంవోను నింపడం 09.25 గంటలకు పూర్తయింది.

    దేశంలో, ఆక్సిజన్‌ అవసరమైన రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ అందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. ఇప్పటివరకు 35000 మె.ట. ఎల్‌ఎంవోను 15 రాష్ట్రాలకు రవాణా చేశారు. సుమారు 480 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇందుకోసం పనిచేశాయి.

    వీలైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఎల్‌ఎంవోను అందించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

***



(Release ID: 1738634) Visitor Counter : 210