రైల్వే మంత్రిత్వ శాఖ

2021-22 విద్యా సంవత్సరంలో బిబిఎ,బీఎస్సీ ,బీటెక్ ,ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్

Posted On: 22 JUL 2021 2:39PM by PIB Hyderabad

2021-22 విద్యా సంవత్సరంలో బిబిఎ,బీఎస్సీ ,బీటెక్ ,ఎంబీఏఎంఎస్సీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణ గడువును  నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్ట్  ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్టిఐ)పొడిగించింది. వడోదరలో రైల్వే మంత్రిత్వశాఖ నెలకొల్పిన  నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్ట్  ఇన్స్టిట్యూట్ డీమ్డ్ యూనివెరిస్తుంటీగా గుర్తింపు పొందింది. 12వ తరగతి ఫలితాలుజేఈఈ మెయిన్స్విశ్వవిద్యాలయాల అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాలుప్రవేశాల నిర్వహణవిద్యా సంవత్సర నిర్వహణపై తాజాగా ఏఐసీటీఈయూజీసీ చేసిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎన్ఆర్టిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని  బిబిఎ,బీఎస్సీ ,ఎంబీఏఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్ట్ 21వరకు,బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్ 15వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని  ఎన్ఆర్టిఐ వైస్ ఛాన్సలర్ అల్కా అరోరా మిశ్రా తెలిపారు. కోవిడ్ తో పాటు 12 తరగతి ఫలితాల ప్రకటనవిశ్వవిద్యాలయాల  పరీక్షల ఫలితాల వెల్లడిజేఈఈ పరీక్షల నిర్వహణలో చేసిన మార్పులుమార్గదర్శకాల జారీ లో వచ్చిన మార్పుల తో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అల్కా అరోరా తెలిపారు. తమ ముందు ఉన్న అవకాశాలను పరిశీలించి  ఎన్ఆర్టిఐ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో చేరడానికి వారికి వీలు కల్పించాలని దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించామని అన్నారు. 

ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు  www.nrti.edu.in  లో దరఖాస్తు  చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. 

సవరించిన తేదీలు:

బిబిఎ,బీఎస్సీ , ఎంఎస్సీ మరియు  ఎంబీఏ కోర్సులు : ఆగస్టు 21, 2021

బి .టెక్. కోర్సులు సెప్టెంబర్ 15, 2021 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 

2021-22 విద్యా సంవత్సరంలో ఎన్ఆర్టిఐ అందిస్తున్న కోర్సులు 

*అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు  

 >బీబీఏ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజిమెంట్ 

 

 >బీఎస్సీ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ

 

 >బి.టెక్.  రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్

 

 >బి. టెక్.  రైల్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

 

 >బి. టెక్.మెకానికల్ అండ్ రైల్ ఇంజనీరింగ్ జమాల్‌పూర్‌లోని ఇరిమీలో అందించనున్నారు

*  పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

>ఎంబీఏ   ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజిమెంట్ 

 >ఎంబీఏ సప్లై చైన్  మేనేజిమెంట్

ఎంఎస్సి ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ 

  >ఎం ఎస్ సి   రవాణా సమాచార వ్యవస్థలు మరియు విశ్లేషణలు 

  >ఎం ఎస్ సి   రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్

 (అంతర్జాతీయ డిగ్రీ కార్యక్రమం యూకే  లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ సహకారంతోఅందిస్తున్నారు)

· పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు  

  పిజిడిఎం   ట్రాన్స్‌పోర్టేషన్   / లాజిస్టిక్స్ 

 పిజిడిఎం ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ & ఫైనాన్సింగ్ / ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్

వివరాలకు : info@nrti.edu.in  సంప్రదించ వచ్చును. 

దేశంలోని వివిధ కేంద్రాల్లో ఎన్‌ఆర్‌టిఐ నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష ఆధారంగా బిబిఎ, బిఎస్‌సి, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి  బి టెక్ కోర్సులలో ప్రవేశం జెఇఇ మెయిన్స్ స్కోరు ఆధారంగా ఉంటుంది.  గతేడాది సంస్థలో ఉన్న  425 సీట్లకు 7 వేలకు పైగా విద్యార్థులు పోటీ పడ్డారు. నిపుణులు సభ్యులుగా ఉన్న బోర్డు పర్యవేక్షణలో  ఎన్‌ఆర్‌టిఐ పనిచేస్తోంది. బోర్డులో ఇద్దరు ఐఐటిల డైరెక్టర్లు, ప్రముఖ విద్యావేత్తలు మరియు పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గా వ్యవహరించే భారత రైల్వేల చైర్మన్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేస్తారు.

రైలు రవాణా రంగాల్లో అత్యుతమ శిక్షణ ఇస్స్తున్న  ఎన్‌ఆర్‌టిఐ ప్రపంచ ప్రసిద్ధి పొందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యుసి బర్కిలీ మరియు కార్నెల్‌తో సహా ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో అవగాహనా ఒప్పందాలను కలిగివుంది. ఎన్‌ఆర్‌టిఐలో తొలిసారిగా బీబీఏ, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, ఎల్ అండ్ టి, మహీంద్రా గ్రూప్, హిందుస్తాన్ యూనిలీవర్, సిమెన్స్, కెఇసి ఇంటర్నేషనల్ లాంటి  ప్రముఖ  భారతీయ మరియు ఎంఎన్‌సి సంస్థలలో ఉద్యోగాలు పొందారు. 

***(Release ID: 1737812) Visitor Counter : 82