ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా తో టెలిఫోన్ లో మాట్లాడారు
నాడు పోస్టు చేయడమైనది:
19 JUL 2021 2:43PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా తో టెలిఫోన్ లో మాట్లాడారు. నేపాల్ ప్రధాని గా శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ఎన్నికైనందుకు మరియు పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం పై జరిగిన వోటింగు లో గెలుపు ను సాధించినందుకు ఆయన ను శ్రీ నరేంద్ర మోదీ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశాని కి, నేపాల్ కు మధ్య నెలకొన్న విశిష్టమైనటువంటి మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య ప్రత్యేక మైత్రి ని సూచిస్తూ ఉన్నటువంటి శతాబ్దాల నాటి సంబంధాల ను గురించి ఈ సందర్భం లో ఇరువురు నేత లు గుర్తు కు తెచ్చుకొన్నారు. అన్ని రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా పెంచుకోవడం కోసం కలసి పని చేయడానికి వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.
మరీ ముఖ్యం గా, కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాల ను సమన్వయ పరచుకోవడం గురించి, తత్సంబంధిత సహకారాన్ని బలోపేతం చేసుకోవడం గురించిన పద్ధతుల పై వారు చర్చించారు.
***
(రిలీజ్ ఐడి: 1736765)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam