పార్లమెంటరీ వ్యవహారాలు

సభలో అర్థవంతమైన చర్చ అవసరం: ప్రధాని మోదీ


పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన
అఖిల పక్ష భేటీలో సభ్యులకు సూచన..

నిబంధనల ప్రకారం ఏ అంశంపై అయినా
చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని స్పష్టీకరణ


19 సార్లు సమావేశం, చర్చకు రానున్న 31 అంశాలు

Posted On: 18 JUL 2021 4:05PM by PIB Hyderabad

  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి సన్నాహంగా ఆదివారం నాడు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పార్లమెంటు ఉభయసభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని సూచించారు. పలువురు పార్లమెంటు సభ్యులు విలువలైన సూచనలు చేశారని, వాటిని సమైక్యస్ఫూర్తితో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు

 

WhatsApp Image 2021-07-18 at 13.44.38.jpeg

  ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంప్రదాపాయాలకు అనుగుణంగా ప్రజలకు సంబంధించిన సమస్యలను సామరస్య పూరకంగా సభలో ప్రస్తావించాలని, సభలో జరిగే చర్చలపై స్పందించే అవకాశం ప్రభుత్వానికి ఉండాలని ప్రధాని అన్నారు. సభలో అలాంటి సానుకూల వాతావరణం ఉండేలా సహకరించడంలో సభ్యులందరికీ బాధ్యత ఉంటుందన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితి ప్రజా ప్రతినిధులకు కచ్చితంగా తెలిసే ఉంటుందని, చర్చలో వారు భాగస్వాములు కావడం వల్ల నిర్ణయం తీసుకునే ప్రక్రియ మరింత అర్థవంతమవుతుందని ప్రధాని అన్నారు. పార్లమెంటు సభ్యుల్లో ఎక్కువ మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందని, పార్లమెంటులో సభా కార్యకలాపాలను మరింత ఆత్మవిశ్వాసంతో నిర్వహించడానికి ఇది దోహదపడుతుందని అన్నారు.

 పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకకరించాలని ప్రధాని అన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగి, ఉభయసభలూ తమ విధిని సక్రమంగా నిర్వర్తించగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి వైరస్ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీ ధరన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

WhatsApp Image 2021-07-18 at 14.55.19.jpeg

  సమావేశం ప్రారంభంలో మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఏ అంశపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు. అన్ని అంశాలపై, సమస్యలపై నిర్మాణాత్మ చర్చ జరిగి తీరాలన్నారు. సోమవారం ( జూలై 19వ తేదీ) నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13వరకూ కొనసాగుతాయని అన్నారు.  వర్షాకాల సమావేశాల సందర్భంగా 19 సార్లు పార్లమెంటు సమావేశమవుతుందని, 29 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలతోపాటుగా, మొత్తం 31 అంశాలను సభల్లో చేపడతామని కేంద్రమంత్రి జోషి చెప్పారు. గతంలో జారీ చేసిన ఆర్జినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకువస్తున్నట్టు ఆయన చెప్పారు.

2021వ సంవత్సరం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చేపట్టబోయే బిల్లుల

I – శాసన సంబంధ వ్యవహారాలు

  1. ట్రిబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనల) బిల్లుl, 2021 –గతంలో జారీ అయిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు రాబోతోంది.
  2. దివాళా, బ్యాంక్రప్టసీ చట్టం (సవరణ) బిల్లు 2021- (ఆర్డినెన్స్ స్థానంలో).
  3. దేశ రాజధాని పరిధి, పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతా నిర్వహణా కమిషన్ బిల్లు, 2021 - (ఆర్డినెన్స్ స్థానంలో).
  4. నిత్యావసర రక్షణ సేవల బిల్లు, 2021- (ఆర్డినెన్స్ స్థానంలో).
  5. భారతీయ ఔషధ కేంద్రీయ మండలి (సవరణ బిల్లు, 2021 - (ఆర్డినెన్స్ స్థానంలో).
  6. హోమియోపతి కేంద్రీయ మండలి (సవరణ) బిల్లు, 2021 - (ఆర్డినెన్స్ స్థానంలో).
  7. డి.ఎన్.ఎ. టెక్నాలజీ (ప్రయోజనం, అమలు) నియంత్రణ బిల్లు, 2019.
  8. ఫ్యాక్టరింగ్ నియంత్రణ (నియంత్రణ) బిల్లు, 2020
  9. అసిస్టెడ్ రిప్రొక్టెడ్ టెక్నాలజీ (నియంత్రణ) బిల్లుl, 2020.
  10. తల్లిదండ్రులు, వయోవృద్ధ పౌరుల నిర్వహణ, సంక్షేమ (సవరణ) బిల్లు, 2019.
  11. జాతీయ ఆహార సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణా బిల్లు, 2019. ఇది ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందింది.
  12. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు, 2021. లోక్.సభ ఆమోదం పొందింది.
  13. బాలనేరస్థుల న్యాయం (పిల్లల సంరక్షణ) సవరణ బిల్లు, 2021. లోక్.సభ ఆమోదం పొందింది.
  14. సరోగసీ నిబంధనల (నియంత్రణ) బిల్లు, 2019.
  15. బొగ్గు నిక్షేప ప్రాంతాల (సేకరణ, అభివృద్ధి) సవరణ బిల్లు, 2021.
  16. చార్డర్డ్ అక్కౌంటెంట్ల, కాస్ట్ అండ్ వర్క్స్ అక్కౌంటెంట్ల, కంపెనీ సెక్రెటరీల (సవరణ) బిల్లు, 2021
  17. పరిమిత జవాబ్దారీ భాగస్వామ్యం (సవరణ) బిల్లు, 2021.
  18. కంటోన్మెంట్ బిల్లు, 2021.
  19. ఇండియన్ అంటార్కిటికా బిల్లు, 2021.
  20. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2021.
  21. భారతీయ అటవీ నిర్వహణ సంస్థ నిర్వహణ బిల్లు, 2021.
  22. పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (సవరణ) బిల్లు, 2021.
  23. డిపాజిట్ బీమా, రుణ పూచీ సంస్థ (సవరణ) బిల్లు, 2021.
  24. భారతీయ సముద్ర మత్స్య పరిశ్రమ వ్యవహారాల బిల్లు, 2021.
  25. పెట్రోలియం, మినిరల్స్, పైప్ లైన్స్ (సవరణ) బిల్లు, 2021.
  26. ఇన్లాండ్ వెజల్స్ బిల్లు, 2021.
  27. విద్యుత్ వ్యవహాహాల (సవరణ) బిల్లు, 2021.
  28. వ్యక్తుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు, 2021.
  29. కొబ్బరి అభివృద్ధి బోర్డు (సవరణ) బిల్లు, 2021.

II – ఆర్థిక సంబంధ వ్యవహాహాలు

  1. 2021-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధన పద్దుల సమర్పణ, పద్దులపై చర్చ, వోటింగ్. సంబంధిత ద్రవ్య వినియోగ బిల్లు ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదం పొందడం.
  2. 2017-18వ సంవత్సరానికి సంబందించిన అదనపు పద్దుల సమర్పణ, పద్దులపై చర్చ, వోటింగ్. సంబంధిత ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదం పొందడం.

 

   అఖిల పక్ష సమావేశానికి 33 రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డి.ఎం.కె., వైఎస్.ఆర్.సి.పి., శివసేన, జనతాదళ్-యు, బిజూ జనతాదళ్,  సమాజవాది పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నా డి.ఎం.కె., బహుజన సమాజ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అకాలీదళ్, రాష్ట్రీయ జనతా దళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, సి.పి.ఐ., సి.పి.ఎం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, ఎ.జె.ఎస్.యు., ఆర్.ఎల్.పి, ఆర్.ఎస్.పి., ఎం.డి.ఎం.కె., తమిళ మానిల కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఎం.ఎన్.ఎఫ్., ఆర్.పిఐ., ఎన్.పి.ఎఫ్. పార్టీలతో సహా మొత్తం 33 పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1736689) Visitor Counter : 207