ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రపంచ యువత నైపుణ్య దినం’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
నవతరం నైపుణ్యాల అభివృద్ధి అనేది ఒక జాతీయ ఆవశ్యకత; ఆత్మనిర్భర్ భారత్ కు పునాది అదే: ప్రధాన మంత్రి
నైపుణ్యాల ను ఒక ఉత్సవం గా జరుపుకోవడం అనేది మన సంస్కృతి లో ఒక భాగం గా ఉంది: ప్రధానమంత్రి
సమాజం లో నైపుణ్యం గల శ్రామికుల కు తగిన గుర్తింపు ను ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు
1.25 కోట్ల పై చిలుకు యువత కు ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ లో భాగం గా శిక్షణ ను ఇవ్వడం జరిగింది: ప్రధాన మంత్రి
ప్రపంచాని కి స్మార్ట్, స్కిల్ డ్ మ్యాన్-పవర్ సొల్యూశన్స్ ను భారతదేశం అందించాలన్నదే, మన యువత కు ప్రావిణ్యాన్ని బోధించే మన వ్యూహం లో కేంద్ర బిందువు గా ఉండాలి: ప్రధాన మంత్రి
మహమ్మారి కి వ్యతిరేకం గా ధీటైన పోరాటం చేయడం లో భారతదేశం లోని నిపుణులైన శ్రామికుల బలగం సాయపడింది: ప్రధాన మంత్రి
యువ జనుల కు నైపుణ్యాల ను అందించడం, వారి ప్రావిణ్యాల కు సానపట్టడం, వారి కౌశలాన్ని పెంచడం నిరంతరాయం గా కొనసాగాలి: ప్రధాన మంత్రి
స్కిల్ ఇండియా మిశన్ అనేది బలహీన వర్గాల కు నైపుణ్యాల ను నేర్పుతూ, డాక్ట
Posted On:
15 JUL 2021 10:55AM by PIB Hyderabad
నవతరం లో నైపుణ్యాల ను అభివృద్ధి పరచడం అనేది ఒక దేశీయ అవసరం గా ఉందని, అంతేకాకుండా, ఈ తరం వారు మన గణతంత్రాన్ని 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వైపునకు తీసుకు వెళ్ళనున్న కారణం గా ఈ కార్యక్రమం ఆత్మనిర్భర్ భారత్ కు పునాది గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన ఆరు సంవత్సరాల లో లభించిన ప్రయోజనాల ను ఊతం గా తీసుకొని స్కిల్ ఇండియా మిశన్ కు జోరు ను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వరల్డ్ యూత్ స్కిల్ డే’ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.
భారతీయ సంస్కృతి లో నైపుణ్యాల కు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. నైపుణ్యాల ను అభివృద్ధి పరచుకోవడాని కి ప్రాముఖ్యాన్ని ఇవ్వడాని కి, ‘మరిన్ని నైపుణ్యాల ను అలవరచుకోవడానికి’, సమాజం ప్రగతి కి మధ్య ఒక లంకె ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయ దశమి, అక్షయ తృతియ, విశ్వకర్మ పూజ.. ఇవి నైపుణ్యాల ను ఒక పండుగ లా జరుపుకొనే సంప్రదాయాలు గా ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సంప్రదాయాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వడ్రంగులు, కుమ్మరి కార్మికులు, లోహ శ్రామికులు, పారిశుధ్య శ్రామికులు, తోటల లో పని చేసేవారు, నేత కార్మికులు వంటి నైపుణ్యం కలిగిన వృత్తుల కు తగిన మర్యాద ను ఇవ్వాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. చాలా కాలం పాటు దాస్యం లో మగ్గిన కారణం గా మన సామాజిక, విద్య వ్యవస్థ లో నైపుణ్యాల కు ప్రాముఖ్యం అనేది పలుచన అయిందని ప్రధాన మంత్రి అన్నారు.
చదువు అనేది మనకు ఏమి చేయాలో బోధిస్తుందని, కాగా, నైపుణ్యం అనేది వాస్తవిక కార్యనిర్వహణ లో మనకు దారిని చూపిస్తుందని, మరి స్కిల్ ఇండియా మిశన్ తాలూకు మార్గదర్శక సూత్రం ఇదేనని ప్రధాన మంత్రి చెప్పారు. 1.25 కోట్ల పైచిలు కు యువజనులు ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ లో భాగంగా శిక్షణ ను అందుకొన్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నిత్య జీవితం లో నైపుణ్యాల అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి చెప్తూ, నేర్చుకోవడం అనే ప్రక్రియ సంపాదన దశ కు చేరుకోవడం తో ఆగిపోకూడదన్నారు. నైపుణ్యం కలిగిన వ్యక్తి మాత్రమే నేటి ప్రపంచం లో ఎదుగుతారని ఆయన అన్నారు. ఇది ఇటు వ్యక్తుల కు, అటు దేశాల కు వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచానికి తెలివైన, నేర్పరులైన శ్రామికుల సేవల ను సమకూర్చడం అనేది మన యువత కు నైపుణ్యాల బోధన కు సంబంధించిన మన వ్యూహం లో కీలకం కావాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తం గా నైపుణ్యాల పరం గా అంతరం ఏ మేరకు ఉన్నదీ గుర్తించే దిశ లో అడుగులు పడటాన్ని ఆయన ప్రశంసించారు. దీనితో సంబంధం ఉన్న వర్గాలు స్కిల్, రీ-స్కిల్, మరియు అప్-స్కిల్ తాలూకు ప్రయత్నాల ను ఆపకుండా కొనసాగిస్తూనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక విజ్ఞానం శరవేగం గా మారుతూ ఉన్న కారణం గా సరికొత్త నైపుణ్యాల కు భారీ గిరాకీ ఏర్పడబోతోందని, ఈ కారణం గా స్కిల్, రీ-స్కిల్, అప్-స్కిల్ వేగాన్ని అందుకోవలసి ఉందని ఆయన అన్నారు. మనకు ఉన్న నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఏ విధం గా మహమ్మారికి వ్యతిరేకం గా ఒక ధీటైన యుద్ధం చేయడం లో సాయపడిందీ ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
బలహీన వర్గాల వారికి నైపుణ్యాల ను అందించడం అనే అంశానికి బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ ఎక్కడలేని ప్రాధాన్యాన్ని కట్టబెట్టారని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. స్కిల్ ఇండియా మిశన్ ద్వారా దేశం బాబా సాహెబ్ కన్న కలల ను నెరవేర్చుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉదాహరణ కు తీసుకోవలసి వస్తే, ‘గోయింగ్ ఆన్ లైన్ యాజ్ లీడర్స్’ - (జిఒఎఎల్) వంటి కార్యక్రమాలు ఆదివాసీ వర్గాల వారికి కళలు, సంస్కృతి, హస్తకళలు, వస్త్రాలు, డిజిటల్ లిటరసీ.. వంటి రంగాల లో చేయూతను అందిస్తున్నాయని, దీని ద్వారా ఆదివాసీ జన సంఖ్య లో నవ పారిశ్రామికత్వం వేళ్ళూనుకొంటోందని ఆయన అన్నారు. అదే విధంగా వన్ ధన్ యోజన ఆదివాసీ సమాజాని కి కొత్త కొత్త అవకాశాల తో ముడిపెడుతోందని ఆయన చెప్పారు. ‘‘రాబోయే రోజుల లో మనం ఆ తరహా ప్రచార ఉద్యమాల ను మరింత ఎక్కువగా చేపట్టవలసిన అవసరం ఉందని, మరి మనం ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనతో పాటు దేశాన్ని కూడా నైపుణ్యవంతం గా మలచుకోవాలని’’ సూచిస్తూ, ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1735795)
Visitor Counter : 256
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam