హోం మంత్రిత్వ శాఖ

సమాచార సాంకేతికత చట్టం-2000లోని రద్దయిన సెక్షన్ 66(ఎ) కింద కేసులు నమోదు చేయవద్దని పోలీస్‌ స్టేషన్లను ఆదేశించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన

Posted On: 14 JUL 2021 6:37PM by PIB Hyderabad

సమాచార సాంకేతికత చట్టం-2000లోని రద్దయిన సెక్షన్ 66(ఎ) కింద కేసులు నమోదు చేయవద్దని తమ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను ఆదేశించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. 24.03.2015న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు కోసం 'చట్ట అమలు సంస్థలు' చురుగ్గా ఉండేలా చూడాలని కూడా కోరింది. ఒకవేళ, సమాచార సాంకేతికత చట్టం-2000లోని సెక్షన్ 66(ఎ) కింద ఎక్కడైనా కేసు నమోదయివుంటే, తక్షణం ఉపసంహరించుకోవాలని కూడా హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

    శ్రేయ సింఘాల్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో, సమాచార సాంకేతికత చట్టం-2000లోని సెక్షన్ 66(ఎ)ను కొట్టివేస్తూ 24.03.2015న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి ఈ సెక్షన్‌ రద్దయింది. అందువల్ల ఈ సెక్షన్‌ కింద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.

 

***


(Release ID: 1735622) Visitor Counter : 226