ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 టీకాలు: అపోహలూ, వాస్తవాలూ
కోవిడ్ టీకా కొరతపై వరుస ట్వీట్ల ద్వారా స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్ సుఖ్ మాండవీయ
“రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ముందస్తు ప్రణాళిక వేసుకోగలిగేలా టీకామందు అందుబాటుపై ముందస్తు సమాచారం ఇచ్చాం”
ప్రజల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని హితవు
Posted On:
14 JUL 2021 3:34PM by PIB Hyderabad
దేశంలో టీకామందు కొరత ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల నుంచి, కొంతమంది రాజకీయపార్టీల ప్రతినిధులనుంచి ప్రకటనలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ అనేక వరుస ట్వీట్లతో స్పందించారు. ఈ ఆరోపణలనీ అసత్యాలని, నిరాధారమైనవని, అపోహలని కొట్టిపారేశారు. కేవలం ప్రజలలో ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టించటానికి ఉద్దేశించినవేనన్నారు.
వాస్తవాలు, సహేతుకమైన ఆధారాలతో ప్రస్తుత పరిస్థితిని అంచనావేయాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా, ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా టీకాలు వేయటానికి రాష్ట్రాలకు 2021 జూన్ నెలలో 11.46 కోట్ల డోసుల టీకాలు అందుబాటులో ఉంచామన్నారు. దీన్న జులై నెలలో 13.50 కోట్ల డోసులకు పెంచామన్నారు.
టీకామందు తయారీదారులతో జరిపిన చర్చల ఆధారంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2021 జూన్ 19నే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జులై నెలలో ఎన్ని డోసుల టీకా మందు అందుబాటులో ఉంటుందో ముందుగానే సమాచారం అందించింది. తిరిగి జూన్ 27న, జులై 13న కూడా టీకామందు లభ్యత గురించి సమాచారమిచ్చింది. ఆ విధంగా నెలలో మొదటి, రెండవ పక్షానికి అందుబాటును ప్రతిరోజూ తెలియజేసింది. ఆ విధంగా రాష్టాలు తమ పరిధిలో పంపిణీని క్రమబద్ధం చేసుకొని ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారని, జిల్లా స్థాయిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తారని ఆశించింది. దానివలన ప్రజలకు అవగాహన ఏర్పడు ఎలాంటి సమస్యలూ లేకుండా టీకాలు వేయించుకుంటారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆశించింది.
టీకామందు అందుబాటు మీద రాష్ట్రాలకు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ సరిగా నిర్వహించుకోలేక చాంతాడంత క్యూలలో జనం నిలబడ్దారంటే అసలు సమస్య ఎక్కడున్నదో స్పష్టంగా కనబడుతూనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి తన ట్వీట్లలో వ్యాఖ్యానించారు. టీకామందు కొరత ఉందంటూ మీడియాలో ప్రకటనలిచ్చేవారు వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ప్రజల్లో అయోమయాన్నీ, భయాన్నీ సృష్టించటం మానుకొని నిజాలు తెలుసుకోవాలన్నారు. ముందస్తుగా ఇస్తున్న సమాచారం మీద కూదా అవగాహనలేకపొవటం దురదృష్టకరమన్నారు.
*****
(Release ID: 1735551)
Visitor Counter : 178