ఆర్థిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలలో (‘ఐ.ఎఫ్.ఎస్.సి.’లలో) వ్యాపార వాణిజ్య సేవలను అందించడానికి అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక సేవల వేదిక (‘ఐ.టి.ఎఫ్.ఎస్.’) ను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి - కార్యాచరణ ప్రణాళిక

Posted On: 12 JUL 2021 4:38PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలలోని (‘ఐ.ఎఫ్.ఎస్.సి.’లలోని) ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు, ఆర్థిక సంస్థలను అభివృద్ధి చేసి, నియంత్రించడానికి,  ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. చట్టం-2019 కింద, అంతర్జాతీయ ఆర్ధిక సేవా కేంద్రాల సాధికార సంస్థ (ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ) ను, ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దిశగా, అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలలో (‘ఐ.ఎఫ్‌.ఎస్‌.సి.’లలో) వాణిజ్య ఆర్ధిక సేవలను అందించడానికి, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక సేవల వేదిక (‘ఐ.టి.ఎఫ్‌.ఎస్’) ను ఏర్పాటు చేసి, నిర్వహించడానికి, ఐ.ఎఫ్‌.ఎస్‌.సి.ఎ. ఒక కార్యాచరణ ప్రణాళిక ను విడుదల చేసింది.

ఐ.టి.ఎఫ్.ఎస్. అనే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వేదిక ద్వారా, ఎగుమతి దారులు మరియు దిగుమతి దారులకు పోటీ పరంగా, వారి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం అవసరమైన, వివిధ రకాల వాణిజ్య ఆర్ధిక సౌకర్యాలు పొందటానికి, ఈ కార్యాచరణ ప్రణాళిక వీలు కల్పిస్తుంది.  వాణిజ్య రాబడులను, నగదు నిల్వలు గా మార్చుకోడానికీ, స్వల్పకాలిక నిధులను పొందటానికీ, వీలుగా, వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోడానికి ఇది సహాయపడుతుంది.

ఈ కార్యాచరణ ప్రణాళిక లో పాల్గొనే అభ్యర్థులకు, ఎగుమతి బిల్లుల ద్వారా వాణిజ్య ఆర్ధిక సహాయం పొందడం; రివర్స్ ట్రేడ్ ఫైనాన్సింగ్; లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద బిల్ డిస్కౌంట్;  సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం; ఎగుమతి రుణాలు (ప్యాకింగ్ క్రెడిట్); బీమా సౌకర్యం / రుణ హామీ; ఫ్యాక్టరింగ్ వంటి వాణిజ్య లావాదేవీలతో పాటు, ఇంకా ఇతర అర్హత కలిగిన వాణిజ్య ఆర్ధిక సౌకర్యాలు పొందడానికి, ఐ.టి.ఎఫ్.ఎస్. వేదిక అవకాశాన్ని అందిస్తుంది.

ఈ ప్రకటన యొక్క పూర్తి పాఠం ఐ.ఎఫ్.ఎస్.సి. వెబ్‌- సైట్‌  https://ifsca.gov.in/Circular లో అందుబాటులో ఉంది. 

 

 ****



(Release ID: 1735043) Visitor Counter : 186