పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా శ్రీ అశ్విని కుమార్ చౌబే బాధ్యతలు స్వీకారం

प्रविष्टि तिथि: 12 JUL 2021 1:12PM by PIB Hyderabad


    కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా శ్రీ అశ్విని కుమార్ చౌబే బాధ్యతలు స్వీకరించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్.పి.గుప్తా, ఉన్నతాధికారులు శ్రీ చౌబేకు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

    బాధ్యతల స్వీకారానికి ముందు, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఒక మొక్కను శ్రీ అశ్విని కుమార్ చౌబే నాటారు.
 
     కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, శ్రీ చౌబే మీడియాతో మాట్లాడారు. ఈ బాధ్యత కోసం తనను ఎంచుకున్నందుకు  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడేళ్లలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేక గొప్ప పనులు చేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచడం తన ప్రాధాన్యత అంశంగా శ్రీ చౌబే స్పష్టం చేశారు.

 

***
 


(रिलीज़ आईडी: 1734852) आगंतुक पटल : 587
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam