ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో ఇప్పటిదాకా 37.60 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు

గత 24 గంటలలో 41,506 కొత్త కోవిడ్ కేసులు

చికిత్సలో ఉన్న కేసులు 4,54,118; మొత్తం కేసుల్లో 1.47%
రోజువారీ పాజిటివిటీ 2.25%; 20 రోజులుగా 3% లోపే

ఇప్పటిదాకా 43 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు

Posted On: 11 JUL 2021 10:08AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 37.60 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం

 ప్రకారం 48,33,797 శిబిరాల ద్వారా 37,60,32,586 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 37,23,367 టీకాలిచ్చారు. వాటి

వివరాలు ఇలా ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,47,862

రెండో డోస్

74,02,098

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,76,64,075

రెండో డోస్

98,91,050

18-44 వయోవర్గం

మొదటి డోస్

11,18,19,570

రెండో డోస్

37,01,692

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,33,66,230

రెండో డోస్

2,35,53,988

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,00,73,761

రెండో డోస్

2,83,12,260

మొత్తం

37,60,32,586

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  

చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  41,506 కొత్త కరోనా కేసులు

 నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 14 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల

ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018IN2.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,54,118 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.47% మాత్రమే.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020V7O.jpg

కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ 2,99,75,064 కు చేరింది. కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ  ఉన్నారు. గత 24  

గంటలలో  41,526 మంది కోలుకున్నారు.  దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 97.20% కు చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033W56.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,43,500 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన

మొత్తం పరీక్షలు 43 కోట్లకు పైగా (43,08,85,470) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ 

తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.32% కాగా రోజువారీ పాజిటివిటీ  2.35%  అయింది. వరుసగా 20 రోజులుగా

ఇది 3% లోపు,  34 రోజులుగా 5% లోపే ఉంటోంది

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JLRT.jpg

***


(Release ID: 1734633) Visitor Counter : 209