చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

శాసన మరియు న్యాయశాఖ మంత్రిగా శ్రీ కిరణ్ రిజిజు బ్యాధతలు స్వీకరించారు

Posted On: 08 JUL 2021 1:01PM by PIB Hyderabad

మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో శాసన మరియు న్యాయశాఖ మంత్రిగా శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసన, న్యాయశాఖ మంత్రిగా విధుల నిర్వహణ తనకు అతిపెద్ద బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల అంచనాలను నెరవేర్చడానికి తాను ప్రాధాన్యతనిస్తానని, తన బాధ్యతలను పారదర్శంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తానన్నారు.



శాసన, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కిరణ్ రిజిజు  2019, మే నుంచి 2021, జూలై వరకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయమంత్రి(ఇన్చార్జ్)గా కొనసాగారు. అంతేకాకుండా 2014, మే నుంచి 2019 మే వరకు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు.

రాజకీయంగా చురుకైన కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ రిజిజు... విద్యార్థి దశ నుంచే ప్రజా వ్యవహారాలపై ఎంతో ఆసక్తి చూపించారు. 31 సంవత్సరాల వయస్సులో ఆయన భారత ప్రభుత్వం (2002-04) లోని ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ సభ్యుడిగా నియమింపబడ్డారు. 2004 లో దేశంలోనే అతిపెద్దదైన పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ నియోజకవర్గం నుంచి 14 వ లోక్సభకు ఎన్నికయ్యారు.

సభలోనే కాకుండా  సభ వెలుపల కూడా పార్లమెంటరీ పనుల్లో చురుకుగా వ్యవహరించి.. ఎంపీగా తన అనుభవజ్ఞులైన సహచరుల  నుంచి అనతికాలంలోనే గౌరవమర్యాదలు పొందారు. 14వ లోక్సభలో పార్లమెంటులోని అనేక కమిటీల్లో కిరణ్ రిజిజు సభ్యులుగా పనిచేశారు. 90శాతం కంటే ఎక్కువ హాజరు రికార్డు సొంతం చేసుకున్న రిజిజు.. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతగల ప్రశ్నలను లేవనెత్తడంలో, ముఖ్య చర్చల్లో ఆకట్టుకునే ప్రసంగాలతో  తనదైన ముద్రను ప్రదర్శించిన రిజిజును మీడియా ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసింది.


దేశంలోని అభివృద్ధికి నోచుకోని, అత్యంత మారుమూల ప్రాంతాల్లో పెరిగినప్పటికీ.. జీవితం తనకు అందించిన ప్రతి అవకాశాన్ని స్వీకరించారు. ఈ రోజు భారత ప్రభుత్వంలో, ప్రజల దృష్టిలో ఈశాన్య గొంతుగా గుర్తింపు పొందారు. ఈశాన్య ప్రాంతాన్ని జాతీయ ప్రధాన స్రవంతితో అనుసంధానం చేయాలని బలమైన కోరిక కలిగిన న్యాయవాది కిరణ్ రిజిజు. ఆయన కృషికి గుర్తింపుగా 2014, మే 16న 16వ లోక్సభకు ఎన్నికైన తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రిమండలిలో  2014, మే 26న హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 

 

***

 



(Release ID: 1734094) Visitor Counter : 139