ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ సార్స్-కోవై-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసిఓజి) పై ప్రశ్నోత్తరాలు

Posted On: 07 JUL 2021 12:45PM by PIB Hyderabad

ప్రశ్న: ఐఎన్ఎస్ఏసిఓజి అంటే ఏమిటి?

సమాధానం:  ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసిఓజి) అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి బహుళ సంస్థల జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీల (ఆర్జిఎస్ఎల్) ఏకీకృత సంస్థ. దీనిని 2020 డిసెంబర్ 30న స్థాపించారు. ప్రారంభంలో ఈ సహవ్యవస్థకు 10 లాబొరేటరీలు ఉండేవి. సార్స్-కోవ్-2లోని జెనోమిక్ వేరియేషన్స్ ని పర్యవేక్షించే ఈ లాబొరేటరీలు ప్రస్తుతం 28 ఉన్నాయి. 

ప్రశ్న: ఐఎన్ఎస్ఏసిఓజి లక్ష్యం ఏమిటి?

సమాధానం: సాధారణంగా కోవిడ్-19 వైరస్ అని పిలువబడే సార్స్-కోవ్-2 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన ప్రజారోగ్య సవాళ్లను విసిరింది.  సార్స్-కోవ్-2  వైరస్ వ్యాప్తి, పరిణామాన్ని, దాని ఉత్పరివర్తనలు, తుది వేరియంట్లను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, జన్యుసంబంధమైన డేటా లోతైన క్రమం, విశ్లేషణ అవసరం అని భావించారు. ఈ నేపథ్యంలో,  సార్స్-కోవ్-2   వైరస్ మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి  ఐఎన్ఎస్ఏసిఓజి స్థాపించడం అయింది. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, అభివృద్ధి చెందుతుందనే దానిపై మన అవగాహనకు ఇది సహాయపడుతుంది.  ఐఎన్ఎస్ఏసిఓజి  కింద ఉన్న ప్రయోగశాలలలో చేసిన నమూనాల విశ్లేషణ, క్రమం ఆధారంగా జన్యు సంకేతంలో ఏదైనా మార్పులు లేదా వైరస్‌లోని ఉత్పరివర్తనలను గమనించవచ్చు.

ఐఎన్ఎస్ఏసిఓజి నిర్దిష్ట లక్ష్యాలివి:

  • దేశంలో వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (విఓఐ), వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (విఓసి) స్థితిని నిర్ధారించడానికి
  • జెనోమిక్ వేరియంట్లను ముందుగా గుర్తించడం కోసం సెంటినెల్ నిఘా మరియు ఉధృతి నిఘా యంత్రాంగాలను ఏర్పాటు చేయడం మరియు సమర్థవంతమైన ప్రజారోగ్య ప్రతిస్పందనను రూపొందించడంలో సహాయపడటం
  • సూపర్-స్ప్రెడర్ సంఘటనల సమయంలో సేకరించిన నమూనాలలో మరియు కేసులు / మరణాల పెరుగుతున్న ధోరణిని నివేదించే ప్రాంతాలలో జన్యు వేరియంట్ల ఉనికిని నిర్ణయించడం మొదలైనవి...    

ప్రశ్న: భారతదేశం సార్స్-కోవ్-2 వైరల్ సీక్వెన్సింగ్‌ను ఎప్పుడు ప్రారంభించింది? 

సమాధానం: భారతదేశం 2020 లో సార్స్-కోవ్-2 వైరల్ జన్యువులను క్రమం చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో, బ్రిటన్, బ్రెజిల్ లేదా దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి చేరుకున్న లేదా ఈ దేశాల గుండా ప్రయాణం చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల నమూనాలను ఎన్ఐవి, ఐసిఎంఆర్ క్రమం తప్పకుండా నమోదు చేశాయి. ఎందుకంటే ఈ దేశాలలో కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. కేసులలో ఆకస్మిక పెరుగుదలను నివేదించే రాష్ట్రాల నుండి ఆర్టిపిసిఆర్ పాజిటివ్ నమూనాలు ప్రాధాన్యతపై క్రమం చేయబడ్డాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి), అలాగే వ్యక్తిగత సంస్థల ప్రయత్నాల ద్వారా ఈ ప్రయత్నాలు మరింత విస్తరించాయి.

భారతదేశం యొక్క ప్రాధమిక దృష్టి దేశంలో ఆందోళన చెందుతున్న ప్రపంచ వేరియంట్లైన - ఆల్ఫా (బి.1.1.7), బీటా (బి.1.351) మరియు గామా (పి.1) పరిమితం చేయడం భారతదేశం మొదటి ప్రాధామ్యం. ఇవి అధిక ప్రసార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ వేరియంట్ల ప్రవేశాన్ని ఐఎన్ఎస్ఏసిఓజి జాగ్రత్తగా ట్రాక్ చేసింది. తదనంతరం, ఐఎన్ఎస్ఏసిఓజి ప్రయోగశాలలలో నిర్వహించిన హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ఆధారంగా డెల్టా మరియు డెల్టా ప్లస్ రకాలను కూడా గుర్తించారు.

ప్రశ్న: భారతదేశంలో సార్స్-కోవ్-2 నిఘా కోసం వ్యూహం ఏమిటి? 

సమాధానం: ప్రాధమికంగా, మొత్తం ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్స్‌లో 3-5% ని సీక్వెన్సింగ్ చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులు, సమాజంలో వారి కాంటాక్టులు ద్వారా వ్యాప్తి చెందే వేరియంట్లపై జన్యు పర్యవేక్షణ కేంద్రీకృతమైంది.

తదనంతరం, నిరంతర అప్రమత్తంగా ఉండే నిఘా వ్యూహం ఏప్రిల్ 2021 లో రాష్ట్రాలు / యుటిలకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ వ్యూహం ప్రకారం, ఒక ప్రాంతం భౌగోళిక వ్యాప్తిని తగినంతగా సూచించడానికి బహుళ సెంటినెల్ సైట్లు గుర్తిస్తారు. హోల్ జెనోమ్ సీక్వెన్సింగ్ కోసం ప్రతి సెంటినెల్ సైట్ నుండి  ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నమూనాలు పంపిస్తారు. గుర్తించబడిన సెంటినెల్ సైట్ల నుండి క్రమం తప్పకుండా ఎంపిక చేసిన ప్రాంతీయ జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (అర్జీఎస్ఎల్) కు నమూనాలను పంపే వివరణాత్మక ఎస్ఓపి లు రాష్ట్రాలు / యుటీ లకు పంపించారు. రాష్ట్రాలకు ట్యాగ్ చేయబడిన ఐఎన్ఎస్ఏసిఓజి  అర్జీఎస్ఎల్ ల జాబితా కూడా రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది. హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్‌ను అన్ని రాష్ట్రాలు / యుటిలు నియమించాయి .

      1. అప్రమత్తతో కూడిన నిఘా (అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు): ఇది భారతదేశం అంతటా కొనసాగుతున్న నిఘా చర్య. ప్రతి రాష్ట్రం / యుటి సెంటినెల్ ప్రాంతాలను (ఆర్టీ పీసీఆర్ ల్యాబ్‌లు మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో సహా) గుర్తించింది, ఇక్కడ నుండి  ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ నమూనాలను హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతారు. 
      2. వ్యాధి ఉధృతి నిఘా (కోవిడ్-19 క్లస్టర్లు ఉన్న జిల్లాలు లేదా ఉధృతంగా కేసులున్నా ప్రాంతాలు): మచ్చుకు కొన్ని నమూనాల (రాష్ట్ర నిఘా అధికారి / సెంట్రల్ సర్వైలెన్స్ యూనిట్ ఖరారు చేసిన నమూనా వ్యూహం ప్రకారం)ను జిల్లాల నుండి సేకరిస్తారు, ఇవి కేసుల సంఖ్య పెరుగుదలను చూపుతాయి మరియు అర్జీఎస్ఎల్ లకు పంపుతారు.  

ప్రశ్న: ఐఎన్ఎస్ఏసిఓజి ప్రయోగశాలలకు నమూనాలను పంపడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఏమిటి?

సమాధానం: ఐఎన్ఎస్ఏసిఓజి ప్రయోగశాలలకు నమూనాలను పంపే ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, జన్యు శ్రేణి విశ్లేషణ ఆధారంగా తదుపరి చర్య క్రింది విధంగా ఉంది:

  1. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం (ఐడిఎస్పి) యంత్రాంగం జిల్లాలు / సెంటినెల్ సైట్ల నుండి ప్రాంతీయ జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలకు నమూనా సేకరణ మరియు రవాణాను సమన్వయం చేస్తాయి. జీనోమ్ సీక్వెన్సింగ్, వేరియంట్ అఫ్ కన్సర్న్ / వేరియంట్ అఫ్ ఇంటరెస్ట్, ఇతర ఉత్పరివర్తనాలను గుర్తించడానికి ఆర్జీఎస్ఎల్ లు బాధ్యత వహిస్తాయి. రాష్ట్ర నిఘా అధికారులతో సమన్వయంతో క్లినికో-ఎపిడెమియోలాజికల్ సహసంబంధాన్ని స్థాపించడానికి వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (విఓసి) / వరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (విఓఐ) పైసమాచారం సెంట్రల్ సర్వైలెన్స్ యూనిట్, ఐడీఎస్పికి సమర్పించడం జరుగుతుంది.
  2. ఐఎన్ఎస్ఏసిఓజి కి మద్దతుగా ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అండ్ క్లినికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎస్ సి ఏ జి ) లో జరిగిన చర్చల ఆధారంగా, ప్రజారోగ్యానికి సంబంధించిన జన్యు పరివర్తనను గుర్తించిన తరువాత, ఆర్జీఎస్ఎల్ దానిని ఎస్ సి ఏ జి కి సమర్పించాలని నిర్ణయించారు. ఎస్ సి ఏ జి, సంభావ్య వేరియంట్స్ అఫ్ ఇంటరెస్ట్, ఇతర ఉత్పరివర్తనాలను చర్చిస్తుంది మరియు తగినది అనిపిస్తే, తదుపరి దర్యాప్తు కోసం సెంట్రల్ నిఘా విభాగానికి సిఫారసు చేస్తుంది.
  3. కొత్త ఉత్పరివర్తనలు / వేరియంట్స్ అఫ్ కన్సర్న్ మరింత విశ్లేషించి, టీకా సామర్థ్యం, రోగనిరోధకతను తప్పించుకునే లక్షణాలపై ప్రభావాన్ని చూడటానికి జన్యు అధ్యయనాలు చేస్తారు.

 

ప్రశ్న: వేరియంట్స్ అఫ్ కన్సర్న్ (విఓసి) తాజా పరిస్థితి ఏమిటి? 

సమాధానం: భారతదేశంలోని 35 రాష్ట్రాల్లోని 174 జిల్లాల్లో  వేరియంట్స్ అఫ్ కన్సర్న్ కనుగొనడం జరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్ జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో విఓసి లు నమోదయ్యాయి. భారతదేశంలో కమ్యూనిటీ నమూనాలలో కనుగొన్న ప్రజారోగ్య ప్రాముఖ్యత వేరియంట్లు: ఆల్ఫా, బీటా, గామా, డెల్టా.

మహారాష్ట్రలో మొట్టమొదట గమనించిన బి.1.617 పరంపర రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అసాధారణమైన పెరుగుదలతో సంబంధం కలిగి ఉంది. ఇది ఇప్పుడు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బయటపడింది.

 

ప్రశ్న: డెల్టా ప్లస్ వేరియంట్ ఏమిటి ? 

సమాధానం: బి.1.617.2.1 (ఏవై.1) లేదా డెల్టా ప్లస్ అని సాధారణంగా తెలిసిన ఈ వేరియంట్ అదనపు మ్యుటేషన్ కలిగి ఉంటుంది. 


(Release ID: 1733371) Visitor Counter : 378