ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌ దిలీప్ కుమార్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 JUL 2021 9:02AM by PIB Hyderabad

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌ దిలీప్ కుమార్ గారి క‌న్నుమూత ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.  దిలీప్ కుమార్ గారి మృతి మ‌న సాంస్కృతిక జ‌గ‌తి కి లోటు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘ దిలీప్ కుమార్ గారి ని సినిమా ప్ర‌పంచం లో ఒక దిగ్గ‌జం గా సదా స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది.  ఆయ‌న లో సాటిలేన‌టువంటి ప్ర‌తిభ ఉన్న కార‌ణం గావేరు వేరు త‌రాల కు చెందిన ప్రేక్ష‌క లోకాన్ని ఆయ‌న మంత్రముగ్ధులను చేశారు.  ఆయ‌న మృతి మ‌న సాంస్కృతిక జ‌గ‌తి కి లోటు.  ఆయ‌న కుటుంబాని కిమిత్రుల‌ కుఅసంఖ్యాక అభిమానుల‌ కు ఇదే నా సంతాపం.  ఈశ్వరుడు ఆయ‌న ఆత్మ కు శాంతి ని ప్రసాదించు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో  పేర్కొన్నారు.

 


(Release ID: 1733285) Visitor Counter : 171