సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

52 వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2021 నవంబర్ 20 నుండి గోవాలో జరగనుంది


శ్రీ ప్రకాష్ జవదేకర్ 52వ ఐఎఫ్ఎఫ్ఐకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు

Posted On: 05 JUL 2021 5:45PM by PIB Hyderabad

 

గౌరవనీయ సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)52 వ ఎడిషన్‌కు సంబంధించి నిబంధనలు మరియు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఉత్సవం 2021 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగుతుంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలోని పురాతన మరియు భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. జనవరి 2021 లో 51 వ ఎడిషన్ విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని ఐఎఫ్ఎఫ్ఐ యొక్క 52 వ ఎడిషన్ హైబ్రిడ్ ఆకృతిలో జరుగుతుంది. ఈ వేడుకను భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (డిఎఫ్ఎఫ్) గోవా రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతీయ చలన చిత్ర పరిశ్రమ సహకారంతో నిర్వహిస్తోంది.

ఐఎఫ్ఎఫ్ఐని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఎపిఎఫ్‌) గుర్తించింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కొన్ని ఉత్తమమైన సినిమా రచనలను గుర్తిస్తుంది. అలాగే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 52 వ ఎడిషన్ యొక్క పోటీ విభాగంలో పాల్గొనడానికి ఎంట్రీలను 2021 ఆగస్టు 31 వరకూ సమర్పించవచ్చు.

భారతీయ సినిమా మాస్ట్రో శ్రీ సత్యజిత్ రే జయంతి సందర్భంగా ఈసారి ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ, ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్, ఐఎఫ్ఎఫ్ఐలో స్పెషల్ రెట్రోస్పెక్టివ్ ద్వారా నివాళి అర్పించనుంది. అలాగే ఆట్యుర్ యొక్క వారసత్వానికి గుర్తింపుగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం "సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సినిమా" సత్కారం ఐఎఫ్‌ఎఫ్‌ఐ ద్వారా నెలకొల్పబడుతోంది.


సౌరభ్ సింగ్(Release ID: 1732926) Visitor Counter : 227