పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అటవీ వనరుల నిర్వహణలో షెడ్యూల్డ్ తెగలు మరియు అడవుల్లో నివసించే ఇతర సాంప్రదాయ జాతులకు మరిన్ని హక్కులు


రేపు సంయుక్తంగా ప్రకటించనున్న శ్రీ అర్జున్ ముండా, శ్రీ ప్రకాష్ జవదేకర్

Posted On: 05 JUL 2021 4:14PM by PIB Hyderabad

అటవీ వనరుల నిర్వహణలో గిరిజన జాతులకు మరిన్ని హక్కులను కల్పించాలని కేంద్ర గిరిజన వ్యవహారాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని పర్యావరణ్ భవన్ లో రెండు శాఖలు సంయుక్తంగా సంతకాలు చేయనున్నాయి. 

హైబ్రిడ్ పద్థతిలో జరిగే ఈ సంతకాల  కార్యక్రమంలో అటవీ కార్యదర్శి శ్రీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాగిరిజన కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా తో సహా అన్ని రాష్ట్రాల రెవెన్యూ కార్యదర్శులు పాల్గొంటారు.

 ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండాపర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ప్రసంగించనున్నారు.  కార్యక్రమానికి పర్యావరణ శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియోగిరిజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీమతి  రేణుకా సింగ్ సారుత కూడా హాజరవుతారు. 

సాధారణంగా అటవీ హక్కుల చట్టం  అని పిలిచే షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం2006 ను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మరిన్ని చర్యలను తీసుకోవాలన్న లక్ష్యంతో రెండు మంత్రిత్వశాఖలు కలసి పని చేయాలని నిర్ణయించాయి. 

ఈ చట్టం తరతరాలుగా  అడవులలో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు (ఎఫ్‌డిఎస్‌టి) మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (ఒటిఎఫ్‌డి) కు  అటవీ భూములపై హక్కులను గుర్తించి వాటిని వినియోగించుకోవడానికి అధికారం కల్పించింది. అయితే, ఈ  హక్కులు అధికార రికార్డులలో నమోదు వడం లేదు. గిరిజనుల హక్కులను రికార్డుల్లో నమోదు చేసి వారికి భూములపై హక్కులను కల్పించే విధంగా అటవీ హక్కుల చట్టం ను అమలు చేయడం జరుగుతుంది. 



(Release ID: 1732863) Visitor Counter : 678