ప్రధాన మంత్రి కార్యాలయం

దివంగ‌త రామ్ విలాస్ పాస్ వాన్ గారి జ‌యంతి సంద‌ర్భం నాడు ఆయ‌న ను స్మ‌రించుకొన్న‌ ప్ర‌ధాన మంత్రి

Posted On: 05 JUL 2021 9:53AM by PIB Hyderabad

దివంగ‌త రామ్ విలాస్ పాస్ వాన్ గారి జ‌యంతి సందర్బం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన ను స్మ‌రించుకొన్నారు.  రామ్ విలాస్ పాస్ వాన్ గారు భార‌త‌దేశం లో అత్యంత అనుభ‌వం క‌లిగిన పార్ల‌మెంట్ స‌భ్యులలోప‌రిపాల‌కుల లో ఒక‌రు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ఈ రోజు నా మిత్రుడు దివంగ‌త రామ్ విలాస్ పాస్ వాన్ గారి జ‌యంతి.   ఆయ‌న లేని లోటు నన్ను ఎంత‌గానో బాధిస్తోంది.  ఆయ‌న భార‌త‌దేశం లో అత్యంత అనుభ‌వం కలిగిన‌టువంటి పార్ల‌మెంటు స‌భ్యుల లోప‌రిపాలకుల‌ లో ఒక‌రు అని చెప్పాలి.  ప్ర‌జాసేవ కు ఆయ‌న అందించిన తోడ్పాటులను, ఆద‌ర‌ణ కు నోచుకోని వర్గాల వారికి సాధికారిత ను క‌ల్పించడం కోసం ఆయ‌న చేసిన శ్ర‌మ ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1732780) Visitor Counter : 163