ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
సంస్కరణల ఆధారిత, ఫలితాలతో సంబంధమున్న సరికొత్త పంపిణీ రంగ పథకానికి కేబినెట్ ఆమోదం
Posted On:
30 JUN 2021 4:20PM by PIB Hyderabad
సంస్కరణల ఆధారిత, ఫలితాలతో సంబంధమున్న సరికొత్త పంపిణీ రంగ పథకానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని డిస్కంల (ప్రైవేటు మినహాయించి) పనితీరును మెరుగుపరచడానికిగాను ఈ పథకాన్ని తయారు చేశారు. దీని ద్వారా అన్ని డిస్కంల ఆర్ధిక సుస్థిరతను మెరుగుపరుస్తారు. ఇందుకుగాను వాటి సరఫరా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికిగాను అన్ని డిస్కంలకు నిబంధనలతో కూడిన ఆర్ధిక సాయం అందిస్తారు. అన్ని రాష్ట్రాలకు ఒకే పథకం అన్నట్టుగా కాకుండా ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తారు. తదనుగుణంగా ప్రణాళికను తయారు చేస్తారు. ఆర్ధికంగా మెరుగుదలను సాధించాలనే నిబంధన ఆధారంగా రూపొందించిన కనీస ప్రమాణాలను సాధించే డిస్కంలకు, అర్హత నిబంధనలకనుగుణంగా వున్న డిస్కంలకు ఈ ఆర్ధిక సాయం అందుతుంది.
ఈ పథకం కింద రూ. 3, 03, 758 కోట్లను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 97, 631 కోట్లు. ఐపిడిఎస్, డిడియు జి జెవై , పిఎండిపి -2015 పథకాల కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్ లలో ప్రస్తుతం అమల్లో వున్న ఆమోదిత ప్రాజెక్టులను నూతన పథకంలో కలుపుతారు. తద్వారా ఆదా చేసిన డబ్బులను (సుమారుగా రూ. 17, 000 కోట్లు) సరికొత్తగా వస్తున్న పంపిణీ రంగ పథకంలోకి తీసుకు రావడం జరుగుతుంది.
ఈ పథకం 2025-26వరకూ అందుబాటులో వుంటుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికిగాను ఆర్ ఇ సి, పిఎఫ్ సిలను నోడల్ ఏజెన్సీలుగా నామినేట్ చేశారు.
పథక లక్ష్యాలు
దేశవ్యాప్తంగా 2024-25 నాటికి ఏటి అండ్ సి నష్ట్రాలను 12 నుంచి 15 శాతం స్థాయిలకు తగ్గించాలి.
2024-25 నాటికి ఏసిఎస్ - ఏ ఆర్ ఆర్ ల మధ్య తేడాను జీరోకు తగ్గించాలి.
ఆధునిక డిస్కంలకు సంబంధించిన సంస్థాగత సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. ఆర్ధికంగా స్థిరమైన, పనితీరులో సమర్థవంతమైన పంపిణీ రంగం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన, అదుబాటు ధరల్లో విద్యుత్తును అదించడానికిగాను ఈ పథకాన్ని తయారు చేయడం జరిగింది.
వివరాలు
ఈ పథకం ద్వారా లబ్ధి పొందే డిస్కంల పనితీరును ప్రతి ఏడాది మదింపు చేస్తారు. ఈ మదింపును ఏటి అండ్ సి నష్టాలు, ఏసిఎస్ - ఏ ఆర్ ఆర్ గ్యాపులు, మౌలిక సదుపాయాల మెరుగుదల సామర్థ్యం వినియోగదారుల సేవలు, సరఫరా చేసిన గంటలు, కార్పొరేట్ గవర్నెన్స్ మొదలైన అంశాల ఆధారంగా చేస్తారు. ఆయా ప్రమాణాల ఆధారంగా 60 శాతం మార్కులు సాధించిన డిస్కంలకు మాత్రమే ఆ ఏడాది ఈ పథకాన్ని వర్తింప చేయడం జరుగుతుంది.
అన్నదాతలకు అందించే విద్యుత్తుకు సంబంధించి సరఫరాను మెరుగుపరచాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఆయా వ్యవసాయ ఫీడర్లకు పగటిపూటనే సౌలార్ విద్యుత్తును అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ పథకం కింద పదివేల వ్యవసాయ ఫీడర్లను గుర్తిస్తారు. వీటికోసం రూ. 20 వేల కోట్లను కేటాయించారు. దీనివల్ల వ్యవసాయానికి విద్యుత్తును వాడుకునే రైతులకు మేలు జరుగుతుంది. వారికి మాత్రమే సేవలందించే వ్యవసాయ ఫీడర్ల ద్వారా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవెమ్ ఉత్తాన్ మహాభియాన్ ( పిఎం-కెయుఎస్ యు ఎం) పథకంలో కలపడం జరుగుతుంది. దీని ద్వారా అన్ని ఫీడర్లను సౌరీకరించడం జరుగుతుంది. తద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంద్వారా వినియోగదారుల్లో సాధికారత తేవాలనేది ఈ పథకంలో ముఖ్యమైన అంశం. ఈ స్మార్ట్ మీటర్ వ్యవస్థను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం కింద అమలు చేస్తారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు తమ విద్యత్తు వినియోగాన్ని నెలవారీగా కాకుండా రోజువారీ పర్యవేక్షించుకోవచ్చు. తద్వారా వినియోగదారులు తమ అవసరాల మేరకు అందుబాటులోని వనరుల ప్రకారం విద్యుత్తును ఉపయోగించుకుంటారు. ఈ పథకం అమలయిన కాలంలో 25 కోట్ల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దశలవారీగా వాటిని ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో 2023 నాటికి పది కోట్ల ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి ఏర్పాటుకు సంబంధించిన పనులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుంది. అనుకున్న సమయానికి వాటి ఏర్పాటు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లనేవి ఒకదానితో మరొకటి దూరం దూరంగా వుంటాయి. నివాస ప్రాంతాలకు దూరంగా వుంటాయి. కాబట్టి ఆ కనెక్షన్లకు ఫీడర్ మీటర్లు మాత్రమే వుంటాయి.
వినియోగదారులకు ప్రి ఫెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్టుగానే పీడర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ కు సంబంధించి సిస్టమ్ మీటరింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని పిపిపి మోడ్‌లోనే అమలు చేస్తారు.
ఆయా డిస్కంలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి సమాచారాన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఐటీ / ఓటీ పరికరాలద్వారా ముఖ్యంగా సిస్టమ్ మీటర్లు, ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషిస్తారు. తద్వారా ఆయా డిస్కంలు తమ పనితీరును మెరుగు పరుచుకోగలుగుతాయి. అంతే కాదు వాటిని ఆర్ధిక స్థిరత్వం పెరుగుతుది. దీని కారణంగా దేశవ్యాప్తంగా పంపిణీ రంగంలో స్టార్టప్స్ కు ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రధాన అంశాలు
వినియోగదారుల మీటర్లు, సిస్టమ్ మీటర్లు
వ్యవసాయ రంగ వినియోగదారులకు మినహాయించి మొత్తం వినియోగదారులకు ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్లు.
స్మార్ట్ మీటర్ల విధానం కింద 25 కోట్ల మంది వినియోగదారులు.
మొదట పట్టణ ప్రాంతాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, అమృత్ నగరాలకు, అధిక నష్టాలబారిన పడుతున్న ప్రాంతాలకు ప్రీ ఫెయిడ్ మీటరింగ్ వుంటుంది. 2023 నాటికి 10 కోట్ల ప్రి పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తారు. మిగతావాటిని దశలవారీగా ఏర్పాటు చేస్తారు.
పీడర్ల విభజన
ఫీడర్ల విభజనకు నిధులందించడంపైన ఈ పథకం దృష్టి పెడుతుంది. దీని కారణంగా ఆయా ఫీడర్లకు సౌర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. తద్వారా అన్నదాతలకు తక్కువ ధరల్లోను లేదా ఉచిత విద్యుత్తు లభిస్తుంది. రైతులకు అదనపు ఆదాయం వస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ. అన్ని పట్టణ ప్రాంతాల్లో పర్యవేక్షణ నియంత్రణ, డాటా అక్విజిషన్ వుంటుంది. వంద పట్టణ కేంద్రాల్లో డిఎంఎస్.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వ్యవస్థ బలోపేతం
ఈశాన్య రాష్ట్రాలను, కేంద్ర పాలితప్రాంతాను స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలుగా పరిగణిస్తారు.
ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి మీటరుకు రూ.900 గ్రాంటు వుంటుంది. లేదా ప్రతి వినియోగదారుని మీటరుకు అయ్యే వ్యయంలో 15 శాతం అందిస్తారు. ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తమయితే దాన్నే అందిస్తారు. ఇక స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి ప్రతి మీటరకు రూ. 1350 గానీ ఆ మీటరు ఏర్పాటుకయ్యే వ్యయంలో 22.5 శాతాన్నిగానీ గ్రాంటుగా అందిస్తారు. ఇక్కడకూడా ఈ రెండింటిలో ఏది తక్కుత మొత్తమయితే దాన్నే అందిస్తారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో 2023 డిసెంబర్ నాటికి లక్ష్యాన్ని చేరుకునే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం కింద పై గ్రాంట్లలో యాభై శాతాన్ని అందిస్తారు.
ఇక స్మార్ట్ మీటర్లకు సంబంధించి కాకుండా ఇతర పనుల విషయంలో ఆయా డిస్కంలకు ఇచ్చే అత్యధిక ఆర్ధిక సాయం ఆమోదిత వ్యయంలో 60శాతం వుంటుంది. ప్రత్యేక కేటిగిరీ రాష్ట్రాలకైతే ఆమోదిత వ్యయంలో అత్యధిక ఆర్థిక సాయం 90 శాతం వుంటుంది.
(Release ID: 1731811)
Visitor Counter : 320
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam