మంత్రిమండలి

ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన (ఎబిఆర్ వై) లో భాగం గా రిజిస్ట్రేశన్ తాలూకు చివరి తేదీ ని 2021 జూన్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు పొడిగించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 30 JUN 2021 4:14PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన (ఎబిఆర్ వై) లో భాగం గా లబ్ధిదారుల నమోదు తాలూకు చివరి తేదీ ని తొమ్మిది నెలల పాటు అంటే 2021 జూన్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు పొడిగించడానికి  తన ఆమోదాన్ని తెలిపింది.  ఈ పొడిగింపు ఫలితం గా, ఇదివరకు అంచనా వేసిన 58.5 లక్షల మంది కి బదులు 71.8 లక్షల మంది కి ఉపాధి అవకాశాలు లభించే వీలు ఉంది.  2021 జూన్ 18 నాటికి ఎబిఆర్ వై లో భాగం గా 902 కోట్ల రూపాయల మేరకు లబ్ధి ని 79,577 సంస్థ ల ద్వారా  21.42 లక్షల మంది లబ్ధిదారుల కు అందించడమైంది.  

ప్రతిపాదించిన ప్రకారం 2022 మార్చి 31 వరకు పొడిగించిన రిజిస్ట్రేశన్ కాలం తాలూకు ఖర్చు ను కూడా కలుపుకొంటే, పథకం యొక్క అంచనా వ్యయం 22,098 కోట్ల రూపాయలు అవుతుంది.

వివిధ రంగాల లో/పరిశ్రమల లో యాజమాన్యాల పై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, తద్ద్వారా యాజమాన్యాలు మరింత మంది శ్రామికుల ను పని లోకి తీసుకొనేటట్టుగా ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ( ఇపిఎఫ్ఒ) ద్వారా అమలు పరచడం జరుగుతోంది.  

ఎబిఆర్ వై లో భాగం గా, ఇపిఎఫ్ఒ లో నమోదైన సంస్థ లు, నెల కు 15,000 రూపాయల లోపు వేతనం అందుకొంటున్న ఆ సంస్థ ల లోని కొత్త ఉద్యోగులు లబ్ధి ని పొందుతున్నారు.  అయితే సంస్థ లు కొత్త ఉద్యోగుల ను పెట్టుకోవలసి ఉండడం గాని, లేదా 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కాలం లో ఉద్యోగులు వారి ఉపాధి ని కోల్పోయిన వారై ఉండడం గాని అనే షరతులు దీనికి వర్తిస్తాయి.

ఎబిఆర్ వై లో భాగం గా, భారత ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలానికి ఇటు ఉద్యోగుల మరియు యాజమాన్యాల వాటా ను (వేతనాల లో 24 శాతం) లేదా కేవలం ఉద్యోగుల వాటా (వేతనాల లో 12 శాతం) జమ చేస్తున్నది.  ఇది ఇపిఎఫ్ఒ లో నమోదు అయిన సంస్థ ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది.  పథకానికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాల వివరాల ను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో, ఇపిఎఫ్ఒ వెబ్ సైట్ లో చూడవచ్చును.

ఆత్మనిర్భర్ భారత్ పాకేజ్ 3.0 లో భాగం గా ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం, కోవిడ్ అనంతర దశ లో  సంఘటిత రంగం లో ఉపాధి కల్పన ను పెంచడం కోసం ఎబిఆర్ వై ను  ప్రకటించడం జరిగింది.  ఈ పథకం దేశ ఆర్థిక వ్యవస్థ పైన కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని, తక్కువ వేతనాన్ని పొందే శ్రామికుల కు కష్టాల ను తగ్గిస్తుంది; అంతేకాక యాజమాన్యాలు వ్యాపార కార్యకలాపాల ను తిరిగి మొదలుపెట్టుకొనేందుకు, వ్యాపారాల ను విస్తరించుకొనేందుకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  (Release ID: 1731521) Visitor Counter : 214