ప్రధాన మంత్రి కార్యాలయం

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్ధిదారుల‌ తో జులై 1న మాట్లాడ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 29 JUN 2021 7:06PM by PIB Hyderabad

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్ధిదారుల‌ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జులై 1న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు.
 
ప్ర‌ధాన మంత్రి 2015 జులై 1న ప్రారంభించిన‌ ‘డిజిట‌ల్ ఇండియా’ కు ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భం లో ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తోంది.  ‘డిజిట‌ల్ ఇండియా’ అనేది ‘న్యూ ఇండియా’ తాలూకు అతి ప్ర‌ధాన‌మైన విజ‌య గాథ‌ల లో ఒక‌టి గా ఉంది.  దీని లక్ష్యమల్లా సేవ‌ల ను సులభతరం గా దిద్దితీర్చడం, ప్ర‌భుత్వాన్ని పౌరుల చెంత కు తీసుకు పోవ‌డం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందింపచేయడం, ప్ర‌జ‌ల కు సాధికారిత ను క‌ల్పించ‌డమూను.  

ఈ కార్య‌క్ర‌మం లో ఎల‌క్ట్రానిక్స్‌, ఐటి శాఖ కేంద్ర మంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

 


(Release ID: 1731374) Visitor Counter : 191