చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
అన్ని హైకోర్టు వెబ్-సైట్లలో ఇప్పుడు శారీరక వికలాంగులకు అందుబాటులో ఉన్న - క్యాప్చాలు
వికలాంగులకు భారతీయ న్యాయ వ్యవస్థను మరింతగా అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రత్యేక ప్రయత్నం చేసిన - భారత సుప్రీంకోర్టు కి చెందిన ఈ-కమిటీ
కోర్టు పత్రాలను అందుబాటులోకి తీసుకు రావడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్న - ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్.ఓ.పి)
వైకల్యాలున్న వ్యక్తుల వినియోగం కోసం రూపొందించబడిన - తీర్పు శోధన పోర్టల్
Posted On:
27 JUN 2021 10:09AM by PIB Hyderabad
భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను వికలాంగులకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావడానికి, గత కొన్ని నెలలుగా, సుప్రీం కోర్టు కు చెందిన ఈ-కమిటీ, ప్రత్యేకంగా కృషి చేసింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఇప్పుడు, అన్ని హైకోర్టు వెబ్-సైట్లలో, వికలాంగులకు (పి.డబ్ల్యూ.డి. లకు), క్యాప్చాలు అందుబాటులో ఉంచడాన్ని, ఈ-కమిటీ చేసిన ప్రయత్నాలలో, ఒక ముఖ్యమైన మైలురాయి సంఘటనగా పేర్కొనవచ్చు.
కోర్టు తీర్పులు / ఆదేశాలు, కారణాల-జాబితా, కేసుల స్థితిని తనిఖీ చేయడం వంటి అనేక ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోడానికి వీలుగా, సంబంధిత హైకోర్టు వెబ్-సైట్ లోకి ప్రవేశించడానికి, ఈ క్యాప్చాలు, ఉపయోగపడతాయి. అనేక హైకోర్టు వెబ్-సైట్‌లు ఇప్పటివరకు, దృష్టి లోపం ఉన్న వికలాంగులకు అందుబాటులో లేని, దృశ్య క్యాప్చాలను మాత్రమే ప్రత్యేకంగా వినియోగిస్తోంది. వాటిని, స్వతంత్రంగా వినియోగించడం వారికి అసాధ్యంగా ఉంది. అన్ని హైకోర్టుల సమన్వయంతో, ఈ-కమిటీ ఇప్పుడు, దృష్టి లోపం ఉన్న వికలాంగులకు అనువుగా ఉండే విధంగా, దృశ్య క్యాప్చాలతో పాటు టెక్స్ట్ / ఆడియో క్యాప్చాలనురూపొందించి, వెబ్-సైట్ లోని సమాచారం ఉపయోగించుకోడానికి వీలు కల్పించింది.
వికలాంగుల రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన అర్హతలకు అనుగుణంగా వికలాంగులకు వారి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఈ-కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ డి. వై. చంద్రచూడ్, 2020 డిసెంబర్, 16వ తేదీన రాసిన లేఖలో, అన్ని హైకోర్టులను కోరారు. ఈ విషయంలో అన్ని హైకోర్టులు చేపట్టాల్సిన నిర్మాణాత్మక జోక్యాల గురించి కూడా, ఆయన, తన లేఖలో, వివరించారు.
ఈ లేఖకు అనుగుణంగా, ఈ ప్రాజెక్టు మొదటి దశలో అన్ని హైకోర్టుల వెబ్-సైట్ల యొక్క డిజిటల్ ఇంటర్-ఫేస్ అందుబాటును నిర్ధారించడానికి ఈ-కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఏదైనా ఒక హైకోర్టు వెబ్-సైట్ ఉపయోగించడానికి అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఆరు ప్రమాణాలను రూపొందించారు. అవి: తీర్పుల అందుబాటు; కారణాల-జాబితా అందుబాటు; కేసుల స్థితి అందుబాటు; కాంట్రాస్ట్ / కలర్ థీమ్; టెక్స్ట్ పరిమాణం [ఏ + ఏఏ]; మరియు స్క్రీన్ రీడర్ అందుబాటు.
అన్ని హైకోర్టుల సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు మరియు వారి సాంకేతిక బృందాలకు అవగాహన కల్పించడానికి, అదేవిధంగా, అన్ని హైకోర్టు వెబ్-సైట్ల యొక్క డిజిటల్ ఇంటర్-ఫేస్ ల అందుబాటును నిర్ధారించడానికీ, అందుకు అనువైన పి.డి.ఎఫ్.లను రూపొందించడంపై శిక్షణఇవ్వడానికీ, ఈ-కమిటీ, వరుస సమావేశాలు నిర్వహించింది. స్క్రీన్ రీడర్ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో ఉన్న కొన్ని వెబ్-సైట్‌లు మినహా మిగిలిన హైకోర్టుల వెబ్-సైట్లు ఇప్పుడు పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. ఏయే హైకోర్టుల వెబ్-సైట్ లు, ఏయే ప్రమాణాలతో అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను "అనుబంధం-ఏ" లో చూడవచ్చు.
అందుబాటులో ఉంచవలసిన కోర్టు పత్రాలను పొందుపరచడానికి అవసరమైన, ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్.ఓ.పి. ని) రూపొందించే పనిలో, ఈ-కమిటీ, ఉంది. ఇది దాని భాగస్వాముల వినియోగానికి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఇది వాటర్-మార్క్ ల సమస్యలను, చేతితో సమాచారాన్ని నమోదు చేయడం, స్టాంపులను సరిగ్గా ఉంచకపోవడం, మరియు దస్త్రాలను సరిగా అందుబాటులో ఉంచలేని సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఈ విషయంలో, ఎస్.ఓ.పి. రూపొందించడం పై, సలహాలు, సూచనలు కోరుతూ, ఈ-కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ డి. వై. చంద్రచూడ్, అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు 2021 జూన్, 25వ తేదీన ఒక లేఖ వ్రాశారు.
వికలాంగులకు అందుబాటులో ఉండే తీర్పు శోధన పోర్టల్ ( https://judgments.ecourts.gov.in ) ను సృష్టించడం, ఎన్.ఐ.సి. సహకారంతో ఈ-కమిటీ చేపట్టిన మరో ముఖ్యమైన ప్రయత్నం. ఈ పోర్టల్ లో అన్ని హైకోర్టులు ఇచ్చిన తీర్పులు మరియు తుది ఉత్తర్వులను పొందుపరచడం జరిగింది. ఈ పోర్టల్ ఉచిత "టెక్స్ట్ సెర్చ్ ఇంజిన్" ను ఉపయోగిస్తుంది. అదనంగా, ఈ పోర్టల్ "టెక్స్ట్ క్యాప్చా" తో పాటు "ఆడియో క్యాప్చా" ను ఉపయోగించుకునే సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇది దృశ్య లోపం ఉన్న వికలాంగులు వెబ్-సైట్ ఉపయోగించడానికి వీలుగా, కాంబో బాక్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ-కమిటీ వెబ్-సైట్ (https://ecommitteesci.gov.in/) మరియు ఈ-కోర్టుల వెబ్-సైట్ (https://ecourts.gov.in/ecourts_home/) లు రెండూ, వైకల్యాలున్న వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ-కమిటీ వెబ్-పేజీ "ఎస్-3-డబ్ల్యూ.ఏ.ఏ.ఎస్. ప్లాట్-ఫారమ్ లో సృష్టించబడింది. వికలాంగులకు వెబ్-సైట్ లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రమాణాలకు అనుగుణంగా, ఇది, ఉంటుంది.
అందుబాటులో ఉండే విధంగా కేసు దాఖలు పద్ధతులను అవలంబించడానికి వీలుగా, న్యాయవాదుల కోసం ఈ-కమిటీ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు కూడా, న్యాయవాదులను సన్నద్ధం చేస్తాయి.
వికలాంగులకు న్యాయం పొందడానికి, ఈ చర్యలు, మొత్తం మీద చూస్తే, గణనీయంగా దోహదపడ్డాయి. అదేవిధంగా, సమాన గౌరవం తో, మన న్యాయ వ్యవస్థలో పాల్గొనడానికి వీలు కల్పించే వారి గౌరవం యొక్క శక్తివంతమైన ధృవీకరణ గా కూడా ఉపయోగపడ్డాయి. పూర్తి సామర్థ్యం ఉన్న తమ సహచరులతో సమానంగా, వైకల్యాలున్న న్యాయ నిపుణులు కూడా, వృత్తి లో పాల్గొనడానికి వీలు కల్పించడం లో, ఈ చర్యలు, ఒక ముఖ్యమైన దశ. ఈ-కమిటీ చేపట్టిన ఈ చర్యలు, మన న్యాయస్థానాలను మినహాయింపు ప్రదేశాల నుండి వికలాంగులు చేరడానికి అనువైన కేంద్రాలుగా మార్చడానికి సహాయపడ్డాయి. అదేవిధంగా, అందుబాటులో ఉంచగల మరియు కలుపుకొని పోయే న్యాయ వ్యవస్థను రూపొందించడానికి ఇది ఒక మార్గం.
అనుబంధం - "ఏ"
(Release ID: 1730804)
Visitor Counter : 654