రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో టీకాల ఉత్పత్తిపై శ్రీ మన్‌సుఖ్ మాండవీయ.. శ్రీ కిషన్ రెడ్డి సమీక్ష
Posted On:
27 JUN 2021 6:23PM by PIB Hyderabad
హైదరాబాద్‌లో టీకాల ఉత్పత్తిపై సమీక్షలో భాగంగా కేంద్ర ఎరువులు-రసాయనాల శాఖ, హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీ కిషన్ రెడ్డి ఇవాళ నగరంలోని భారత్ బయోటెక్ సంస్థలోని తయారీ యూనిట్‌తోపాటు ‘బయో సేఫ్టీ లెవల్-3’ సదుపాయాన్ని కూడా సందర్శించారు. ఔషధ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎస్.అపర్ణ కూడా వారితోపాటు పరిశీలనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ మాండవీయ మాట్లాడుతూ- దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా లక్ష్యసాధన దిశగా టీకాల రూపకర్తలుసహా తయారీదారులకు తగిన మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సమీక్షలో భాగంగా టీకాల ఉత్పత్తిని మరింత పెంచడంపై తయారీదారులతో మంత్రులిద్దరూ చర్చించారు.
(Release ID: 1730745)
Visitor Counter : 196