ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
32 కోట్ల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్ టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 64.25 లక్షల టీకా డోసులు అందజేత
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసులు 50,040
5,86,403కు తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
వరుసగా 45వ రోజు కూడా కొత్త కేసుల సంఖ్యను మించిన రికవరీలు
96.75 శాతానికి పెరిగిన రికవరీ రేటు
Posted On:
27 JUN 2021 11:27AM by PIB Hyderabad
రోజువారీ పాజిటివిటీ 2.82 శాతంగా నమోదు, వరుసగా 20వ రోజు కూడా 5 శాతం కన్నా తక్కువ నమోదు
కొవిడ్‌పై ఘనవిజయం దిశగా, దేశవ్యాప్తంగా అందించిన టీకాల సంఖ్య శనివారంతో 32 కోట్లను దాటింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 42,79,210 సెషన్ల ద్వారా మొత్తం 32,17,60,077 టీకా డోసులను అందించారు. గత 24 గంటల్లో 64,25,893 డోసులు అందించారు.
పూర్తి వివరాలు:
హెచ్‌సీడబ్ల్యూలు
|
మొదటి డోసు
|
1,01,96,091
|
రెండో డోసు
|
72,00,994
|
ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు
|
మొదటి డోసు
|
1,74,36,514
|
రెండో డోసు
|
93,79,246
|
18-44 వయసు వారికి
|
మొదటి డోసు
|
8,34,29,067
|
రెండో డోసు
|
18,56,720
|
45-59 వయసు వారికి
|
మొదటి డోసు
|
8,68,82,578
|
2nd Dose
|
1,46,35,430
|
60 ఏళ్లు పైబడినవారికి
|
మొదటి డోసు
|
6,74,40,309
|
రెండో డోసు
|
2,33,03,128
|
మొత్తం
|
32,17,60,077
|
కొవిడ్ టీకా సార్వత్రీకరణ కార్యక్రమం ఈ ఏడాది జూన్ 21 నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, పరిధి విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,040 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 20 వరుస రోజుల్లో, లక్ష కన్నా తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అవిశ్రాంత, సహకార ప్రయత్నాల ఫలితంగా ఇది సాధ్యమైంది.

దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రతిరోజూ పడిపోతూనే ఉంది. ఆదివారం నాటికి దేశవ్యాప్త కేసుల సంఖ్య 5,86,403గా ఉంది.
గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు మరో 9,162 తగ్గాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులో ప్రస్తుతమున్న క్రియాశీల కేసులు 1.94 శాతం మాత్రమే.

కొవిడ్ బారి నుంచి కోలుకుంటున్న ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున, దేశవ్యాప్తంగా రికవరీలు వరుసగా 45వ రోజు కూడా రోజువారీ కేసులను మించాయి. గత 24 గంటల్లో 57,944 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
రోజువారీ నమోదయ్యే కొత్త కేసులతో పోలిస్తే, గత 24 గంటల్లో దాదాపు 8 వేల (7,904) రికవరీలు నమోదయ్యాయి.

కరోనా విజృంభించిన ప్రారంభ రోజుల నుంచి, వైరస్ సోకిన వారిలో 2,92,51,029 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 57,944 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు 96.75 శాతంగా నమోదైంది. ఈ రికవరీ రేటు నిరంతరం పెరుగుతూనే ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడంతో, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 17,77,309 పరీక్షలు చేశారు. మొత్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.42 కోట్ల (40,42,65,101) పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యంలో వృద్ధి కనిపిస్తుండగా, వారపు పాజిటివిటీ ప్రతిరోజూ క్షీణిస్తూనే ఉంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 2.91గా ఉండగా, రోజువారీ పాజిటివిటీ ఇవాళ 2.82 శాతంగా ఉంది. వరుసగా 20వ రోజు కూడా 5 శాతం కన్నా తక్కువగా నమోదైంది.

(Release ID: 1730713)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam