యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

‘టోక్యో 20’లో పాల్గొనే భారత యువ ఒలింపిక్ జట్టు కోసం రూపొందించిన అధికారిక యువ థీమ్ సాంగ్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.

క్విజ్‌లు, సెల్ఫీ పాయింట్లు, ఒలింపిక్స్పై చర్చలు వంటి వివిధ కార్యకలాపాల ద్వారా క్రీడా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా # చీర్ 4 ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది.

Posted On: 24 JUN 2021 12:33PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల భారత ఒలింపిక్ టీం  అధికారిక థీమ్ సాంగ్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు  క్రీడా శాఖ మంత్రి  కిరణ్ రిజిజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి  రవి మిట్టల్, ఐఓఏ అధ్యక్షుడు  నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్  రాజీవ్ మెహతా, డిజి ఎస్ఐ సందీప్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మోహిత్ చౌహాన్ స్వరపరిచారు . పాడారు. ఆయన భార్య ప్రత్నా గహ్లోత్ పాట రాశారు. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే భారతీయ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి  ప్రేరేపించడానికి దేశం మొత్తం కలిసి రావాలని కేంద్ర క్రీడా మంత్రి  కిరణ్ రిజిజు థీమ్ సాంగ్‌ను ప్రారంభించిన సందర్భంగా అన్నారు. ‘‘ఈ రోజు అధికారిక థీమ్ సాంగ్ ప్రారంభించడం ఆ దిశలో ఒక అడుగు. మోహిత్ చౌహాన్ స్వరపరిచిన  పాడిన శక్తిమంతమైన పాట ప్రతి అథ్లెట్ కు  స్ఫూర్తినిస్తుంది. తన కలను నెరువేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది.  క్విజ్‌లు, సెల్ఫీ పాయింట్లు, చర్చలు  ఒలింపిక్స్పై చర్చలు వంటి వివిధ కార్యకలాపాల ద్వారా క్రీడా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా # చీర్ 4 ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశానికి కీర్తి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నందున భారతదేశంలోని అగ్రశ్రేణి అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు ప్రతి భారతీయుడు ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో చేరాలని నేను కోరుతున్నాను ” అని ఆయన అన్నారు. ఐఓఏ ప్రెసిడెంట్ డాక్టర్ నరీందర్ దృవ్ బాత్రా మాట్లాడుతూ, “ఇది స్ఫూర్తిదాయకమైన పాట మాత్రమే కాదు. ఇది మీ వెనుక ఉన్న 140 కోట్ల మంది ప్రతిధ్వని అని కూడా మా అథ్లెట్లందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.  మీరు మీ సత్తాను చాటి  మన దేశానికి కీర్తిని తెస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను”అని అన్నారు.   ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ఈ సందర్భంగా మాట్లాడుతూ "థీమ్ సాంగ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒలింపిక్స్ అథ్లెట్లు బాగా రాణించేలా ఇది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది.  శక్తిని ఇస్తుందని నా నమ్మకం”అని అన్నారు.  టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న భారతీయ జట్టు కోసం అద్భుతమైన  థీమ్ సాంగ్‌ను స్వరపర్చిన మోహిత్ చౌహన్‌కు ఐఏఓ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 15 విభాగాలకు చెందిన అథ్లెట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఈ జాబితాలో మరింత మంది చేరాలని  ఆశిస్తున్నామని అన్నారు. ఈసారి పతకాల సంఖ్య కాస్త ఎక్కువే కోరుకుంటున్నామని  మెహతా ముగించారు.  భారత జట్టులోని ప్రతి సభ్యునికి, అథ్లెట్కు ‘ ధరించగలిగే ధ్యాన పరికరాల’ను అందించడానికి మాజీ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్,  ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్  పుల్లెల గోపిచంద్కు చెందిన  'ధ్యానా' స్పోర్ట్స్ లతో తమ సంఘం భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందని వెల్లడించారు. టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో అథ్లెట్లు ఐసోలేషన్లో ఉన్నప్పుడు వారి మనస్సులను ఆరోగ్యంగా,  సంతోషంగా ఉంచడానికి ఈ ‘వేరబుల్ మెడిటేషన్ కిట్స్’ సహాయపడతాయని ఆయన వివరించారు. 


(Release ID: 1730221) Visitor Counter : 219