మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహమ్మారి కాలంలో గుణాత్మక విద్యను కొనసాగించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించిన జి20 విద్యామంత్రులు
విద్యాపరమైన అసమానతలను తొలగించే దిశగా భారత నిబద్ధతను పునరుద్ఘాటించిన సంజయ్ ధోత్రే
జి20 విద్యామంత్రుల, విద్య, కార్మిక, ఉపాధిశాఖ మంత్రుల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన ప్రసంగించిన సంజయ్ ధోత్రే
Posted On:
23 JUN 2021 4:49PM by PIB Hyderabad
విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే 22 జూన్, 2021న జరిగిన జి20 విద్యామంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో విద్యా దారిద్య్రం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటంలో ఎలా పురోగమించాలని జి20 విద్యామంత్రులు తమ అభిదప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బ్లెండెడ్ మోడ్ లో ఇటలీ నిర్వహించింది. మహమ్మారి కాలంలో అమలు చేసిన నూతన అనుభవాలను, మిశ్రమ విద్య ద్వారా గుణాత్మక విద్యకు మార్గాలకు సంబంధించిన అనుభావాలను పంచుకోవాలని మంత్రులు తీర్మానించారు.
చిన్న వయసులోనే పాఠశాలను వదలడం, విద్యా దారిద్య్రాన్ని, అసమానతలను క్రమంగా నిర్మూలించేందుకు దేశం కట్టుబడి ఉందని భారత్‌కు ప్రాతినధ్యం వహించిన సంజయ్ ధోత్రే పునరుద్ఘాటించారు. జాతీయ విద్యా విధానం 2020 గురించి మాట్లాడుతూ, ఇది అందరికీ సమాన, కలుపుకుపోయే విద్యను అందించాలనే సంకల్పంతో ఉందని అన్నారు. ముఖ్యంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వెనుకబడే ప్రమాదం ఉన్న పిల్లలు, యువత, ప్రముఖంగా ఆడపిల్లలపై ఈ విధానం దృష్టి పెడుతుందన్నారు.
బహుళ ప్రమేయాల ద్వారా అన్ని విద్యా స్థాయిల్లోనూ జెండర్, సామాజిక వర్గ దూరాలను పూడ్చేదిశగా స్థిర పురోగతిని భారతీయ విద్యా విధానం సాధించిందని ధోత్రే చెప్పారు. పాఠశాలల్లో అంతర్గ్రహణ సామర్ధ్యాన్ని పెంచడం; పాఠశాలలను వదిలి వెళ్ళిన పిల్లల జాడను కనుగొనడం; బలహీన వర్గాల విద్యార్ధుల విద్యా ఫలితాలను పర్యవేక్షించడం, బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి వారి హక్కుల ఉల్లంఘన పట్ల ఏమాత్రం ఉపేక్షించకపోవడం; పిల్లల ఆరోగ్యం కోసం మధ్యాహ్న భోజన పథకం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు తోడ్పడే యంత్రాంగాలు, విద్యాభ్యాసానికి బహుళ మార్గాలు, ఓపెన్, డిస్టెన్స్ విద్యా కార్యక్రమాలను బలోపేతం చేయడం ఇందులో కొన్ని అని ఆయన అన్నారు.
మహమ్మారి సమయంలో విద్యను కొనసాగించడం గురించి మాట్లాడుతూ, భారత్ మిశ్రమ విద్యను విస్త్రతంగా ప్రోత్సహించిందని మంత్రి చెప్పారు. దీక్ష, స్వయం వంటి వివిధ ఇ- లెర్నింగ్ వేదికల ద్వారా డిజిటల్ విద్య విషయాంశాలను అందుబాటులోకి తెచ్చామని, వీటితో పాటు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉచితంగా అందుకునే వీలుగా అనేక ఇతర వేదికలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సంప్రదాయ విద్యలో అనుమతించదగిన భాగం 20% నుంచి 40%కి పెరిగిందన్నారు. దాదాపు 100కు పైగా ఉత్తర ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీలను పూర్తి స్థాయి ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించామన్నారు. డిజిటల్ అంతరాన్ని పరిష్కరించేందుకు భారత్ స్వయం ప్రభ టివి చానెళ్ళను, కమ్యూనిటీ రేడియోను విస్త్రతంగా ఉపయోగికస్తోందని చెప్పారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా, విస్త్రతీకరిస్తన్నామన్నారు. ఎన్ఇపి 202 కింద సాంకేతిక ఆధారిత విద్య కోసం జాతీయ విద్య సాంకేతిక ఫోరంను ఏర్పాటు చేశామన్నారు.
విద్యార్ధుల మానసిక ఆరోగ్య అంశాలను మనోదర్పన్ తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆయన నొక్కి చెప్పారు.
విద్యా దారిద్య్రం, అసమానతలకు, తొలిదశలోనే పాఠశాలను వదలడాన్ని తగ్గించడంలో జి20 దేశాలు చేస్తున్న సామూహిక కృషికి భారత్ తన మద్దతును పునరుద్ఘాటిస్తోందని ధోత్రే చెప్పారు. మహమ్మారి సమయంలో విద్యను కొనసాగించడంలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా మిశ్రమ విద్యా చొరవలను మరింత మెరుగు పరచి, బలోపేతం చేసేందుకు జి20 దేశాలు చేస్తున్న సామూహిక కృషికి మద్దతు ఇస్తుంది.
సమావేశం చివర్లో విద్యా మంత్రులు తీర్మానాన్ని ఆమోదించారు.
అనంతరం విద్యా మంత్రుల, కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశాన్ని కూడా దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించారు. పాఠశాల నుండి పరివర్తనలపై అభిప్రాయాలను జి20 మంత్రులు మార్చుకున్నారు. సమావేశంలో విద్యామంత్రిత్వ శాఖకు సంజయ్ ధోత్రే ప్రాతినిధ్యం వహించారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ తరఫున సహాయమంత్రి (ఇన్‌చార్జి) సంతోష్ గంగ్వార్ పాల్గొన్నారు.
ఆహుతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జి20 దేశాల సభ్యులమైన మనం, యువత తమ విద్యను పూర్తి చేసుకోగానే పని స్థలంలోకి సజావుగా పరివర్తన చెందేలా సిద్ధపరచాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. వెనుకబడే ప్రమాదమున్న సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చి విద్యార్ధులకు ఇది చాలా ముఖ్యమన్నారు.
21వ శతాబ్దపు గ్లోబల్ ఉద్యోగ వేదికకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను యువత అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. డిమాండ్ కు అనుగుణమైన, సామర్ధ్య ఆధారిత, మాడ్యులార్ వృత్తివిద్యా కోర్సుల కోసం వృత్తి సంబంధ విద్యను, సాధారణ అకడెమిక్ విద్యతో సమగ్రం చేయడం తమ పద్ధతి అని అన్నారు.
మధ్య, సెకెండరీ పాఠశాలల్లోనే వృత్తి విద్యను పిల్లలకు పరిచయం చేసి, దానిని ప్రధానస్రవంతి విద్యతో నిరాటంకంగా సగ్రం చేయడానికి జాతీయ విద్యా విధానం 2020 అవకాశమిస్తుందన్న విషయాన్ని మంత్రి పట్టి చూపారు. పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్న 50%మంది విద్యార్ధులు 2025నాటికి వృత్తి విద్యకు పరిచయం కావడమన్నది దాని లక్ష్యమని వివరించారు. నైపుణ్యాల అంతర విశ్లేషణ, స్థానిక అవకాశాలను గుర్తించడంతో వృత్తి విద్యను కలపడం ఎన్ఇపి 2020 అవకాశమిస్తుంది. వృత్తివిద్య విద్యార్ధుల ఊర్ధ్వ చలనాన్ని జాతీయ నైపుణ్యాల అర్హతల చట్రం ద్వారా హామీ ఇస్తుందన్నారు. ఈ చట్రం కింద ప్రమాణాలను అంతర్జాతీయ శ్రామిక సంస్థ నిర్వహించే అంత్జాతీయ వృత్తి వర్గీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతారన్నారు. ఈ చట్రమనేది, గతంలో విద్యను అభ్యసించిన విషయాన్ని గుర్తించి అధికారిక వ్యవస్థ నుంచి డ్రాపౌట్ అయిన విద్యార్ధులను పునః సమగ్రం చేయడం ఆధారంగా ఉంటుందని ఆయన వివరించారు.
ఉనికిలో ఉన్న జాతీయ అప్రెంటీస్‌షిప్ శిక్షణా పథకాన్ని పునఃసమలేఖనం చేయడం ద్వారా యువతకు విద్యానంతర అప్రెంటీస్‌షిప్ అవకాశాలను పెంచుతోందని ధోత్రే తెలిపారు.
వృత్తి విద్యా రంగం, శిక్షణలో జి20 దేశాల మధ్య సహకారానికి భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని చెప్పారు. విద్య నుంచి ఉద్యోగానికి మృదువుగా పరివర్తన చెందేందుకు వ్యూహాలను అభివృద్ధి చేస్తున్న జి20 దేశాల సమిష్ఠి కృషికి భారత ప్రభుత్వ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.
జి20 విద్య, కార్మిక, ఉపాధి మంత్రులు సమావేశానంతరం తీర్మానాన్ని ఆమోదించారు.
జి20 విద్యా మంత్రుల తీర్మానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జి20 విద్యా మంత్రుల, కార్మిక, ఉపాధి మంత్రుల సంయుక్త తీర్మానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1729903)
Visitor Counter : 245