మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగ దినోత్సవం,2021లో పాల్గొన్న 42,28,802మంది పిల్లలు, 22,72,197 యువత, 17,37,440 గర్భస్థ, బిడ్డలకు పాలిస్తున్న తల్లులు
Posted On:
23 JUN 2021 5:25PM by PIB Hyderabad
ఈ నెల 21, 2021 అంతర్జాతీయ యోగ దినోతవ్సవం సందర్భంగా తమ మెరుగైన ఆరోగ్యం, సంక్షేమం కోసం మొత్తం 42,28,802 మంది పిల్లలు, 22,72,197 యువత, 17,37,440 గర్భస్థ, బిడ్డలకు పాలిస్తున్న మహిళలు యోగా మాడ్యూళ్ళలో పాల్గొన్నారు. మొత్తం 32 లక్షల మందికి పైగా క్షేత్రస్థాయి ఉద్యోగులు, 82 లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 22 లక్షల మందికి పైగా ప్రజలు యోగా వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోగా, 29.18మంది ప్రజలు యోగా వీడియోలు ఫార్వార్డ్ చేయగా, 29.18 లక్షల ప్రజలు తమతమ రాష్ట్రాలు / యఉటిలలో యోగా మాడ్యూళ్ళను సాధన చేశారు.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ యోగాదినోత్సవాన్ని పాటించేందుకు, ప్రజారోగ్యం, సంక్షేమ దీర్ఘకాలిక లాభాలను పొందేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సమన్వయంతో పని చేయవలసిందిగా ఆదేశించింది. యోగ దినోత్సవ వేడుకలలో ఎక్కువమంది పాల్గొనేలా పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు చేపట్టారు.
ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఇళ్ళలోనే కాక అంగన్వాడీ కేంద్రాలలో కూడా సాధన చేశారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు, ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్దిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు హాష్‌ట్యాగ్ ## బి విత్‌యోగ బి ఎట్ హోంను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ప్రజలు సామాజిక, డిజిటల్ వేదికలను గరిష్టంగా ఉపయోగించుకొని ఆన్‌లైన్ ద్వారా పాల్గొని అభ్యాసం చేసేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఐదు నిమిషాల ప్రోటోకాల్, కోవిడ్-19 పరిస్థితుల నివారణకు యోగా ప్రోటోకాల్, వత్తిడి నిర్వహణకు యోగా ప్రోటోకాల్, ఉద్యోగులకు, విద్యార్ధులకు, కుటుంబానికి తదితరులకు యోగ అన్న శీర్షికలతో పలు లఘు వీడియోలను తయారు చేసింది. వివిధ యోగా మాడ్యూళ్ళలో స్వీయ అభ్యాసానికి, లబ్ధిదారులతో పంచుకోమని ఆదేశించవలసింది అన్ని రాష్ట్రాలు / కేంద్రప్రభుత్వ ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది.
****
(Release ID: 1729869)
Visitor Counter : 145