శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆవిష్క‌ర‌ణ‌ల స‌హ‌కారానికి బ్రిక్స్ దేశాల అంగీకారం

Posted On: 23 JUN 2021 4:34PM by PIB Hyderabad

ఆవిష్క‌ర‌ణ‌ల‌లో స‌హ‌కారానికి బ్రిక్స్ దేశాలు 11వ బ్రిక్స్ ఎస్ &టి స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో ఏక‌గ్రీవంగా అంగీకారానికి వ‌చ్చాయి. భార‌త్ ప్రతిపాదించిన ఈ అంశాన్నిదీనిని విస్త్రత కార్య‌చర‌ణ ప్ర‌ణాళిక‌గా రూపొందించేందుకు బ్రిక్స్ శాస్త్ర‌, సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ వ్య‌వ‌స్థాప‌క‌త (సైన్స్‌, టెక్నాల‌జీ అండ్ ఇన్నొవేష‌న్ ఆంత్ర్య‌ప్రెన్యూర్‌షిప్ - ఎస్‌టిఐఇపి) వ‌ర్కింగ్ గ్రూప్‌లో ప‌రిగ‌ణిస్తారు. 
బ్రిక్స్ శాస్త్ర‌, సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ వ్య‌వ‌స్థాప‌క‌త క్యాలెండ‌ర్ కార్య‌క‌లాపాల అమ‌లును స‌మీక్షించేందుకు బ్రిక్స్ ఆవిష్క‌ర‌ణ స‌హ‌కారం 2021-2022కు కాన్సెప్ట్ నోట్ ను, కార్యాచర‌ణ ప్ర‌ణాళిక‌ను 22 జూన్ 2021న నిర్వ‌హించిన స‌మావేశంలో చ‌ర్చించారు. బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్స్ కాంక్లేవ్‌, బ్రిక్స్ సీనియ‌ర్ అధికారుల స‌మావేశం, బ్రిక్స్ శాస్త్ర‌, సాంకేతిక మినిస్టీరియ‌ల్ మీటింగ్‌, భార‌త సాంకేతిక‌త‌లో బ్రిక్స్ భాగ‌స్వామ్య స‌ద‌స్సుతో పాటుగా 2021కి ప్ర‌తిపాద‌న‌ల ఆహ్వానాలు కూడా ఈ చ‌ర్చ‌లో భాగం. ఈ స‌మావేశానికి బ్రిక్స్ శాస్త్రా సాంకేతిక మంత్రివర్గాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.  
భార‌త శాస్త్ర‌, సాంకేతిక శాఖ నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి భార‌త‌దేశం త‌ర‌ఫున అంత‌ర్జాతీయ స‌హ‌కార స‌ల‌హాదారు, అధిప‌తి అయిన సంజీవ్ కుమార్ వార్ష్నే అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌లు, అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహ‌క శాఖ (డిపిఐఐటి), క‌న్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సిఐఐ) ప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు. మంత్రిత్వ స్థాయి స‌మావేశం, బ్రిక్స్ స‌ద‌స్సు స‌హా వివిధ రంగాల‌కు సంబంధించిన స‌మావేశాల ప‌రంప‌ర‌లో భాగంగా దీనిని నిర్వ‌హించారు. 
జ‌న‌వ‌రి 2021 నుంచి బ్రిక్స్ అధ్య‌క్ష‌త బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన భార‌త్ సెప్టెంబ‌ర్ 13 నుంచి 16, 2021న బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్స్ కాంక్లేవ్ 6వ ఎడిష‌న్ ను నిర్వ‌హించ‌నుంది. భార‌త‌దేశం ప్ర‌తిపాదించిన‌ట్టుగా ఈ స‌ద‌స్సుకు ఇతివృత్తాలలో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఇంధ‌న ప‌రిష్కారాలు, బాహుశాస్త్రాంత‌ర సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్టం ఉంటాయి. ఈ స‌ద‌స్సుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను జులై మొద‌టివారంలో చేయ‌నున్నారు. 

 

***


(Release ID: 1729800) Visitor Counter : 198